- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రక్తసిక్తమైన రోడ్లు.. ఆరుగురి మృతి
దిశ, జిల్లా యంత్రాంగం
తెలంగాణ రాష్ట్రంలో గురువారం రోడ్లు రక్తసిక్తమయ్యాయి. వేర్వేరు ప్రమాదాల్లో ఆరుగురు మృతిచెందారు. 13 మంది గాయపడ్డారు. మహబూబ్‌నగర్ జిల్లాలో పాదచారులపై లారీ దూసుకెళ్లడంతో ముగ్గురు మృతిచెందగా, వరంగల్ అర్బన్ జిల్లాలో రెండు లారీలు ఢీకొనడంతో ఇద్దరు చనిపోయారు. గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో సంగారెడ్డి జిల్లాలో ఒకరు మృతిచెందారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలో ఓ లారీ బీభత్సం సృష్టించింది. తమిళనాడుకు చెందిన లారీ పనస పండ్ల లోడ్‌తో హైదరాబాద్‌కు బయల్దేరింది. డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా జడ్చర్ల వద్ద పాదచారులపై దూసుకెళ్లింది. ఓ ఇంటిని ఢీకొట్టి ఆగిపోయింది. లారీ కింద చిక్కకుపోయిన ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు. తీవ్రంగా గాయపడిన ఇద్దరిని హాస్పిటల్‌కు తరలించారు. ఇల్లు పూర్తిగా ధ్వంసమైంది. డ్రైవర్ పరారీలో ఉన్నాడు. పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. మరోవైపు వరంగల్ అర్బన్ జిల్లా ధర్మసాగర్ మండలం రాంపూర్ శివారులో లిక్కర్ లోడ్‌తో వెళ్తున్న లారీ, టిప్పర్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు సమీపంలో గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో గణపతి గూడెంకు చెందిన కనోళ్ల శ్రీను( 37 ) మృతిచెందారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం మన్నెగూడ వద్ద రాజీవ్ రహదారిపై బుధవారం ఆర్టీసీ బస్సును టిప్పిర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 11 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను గజ్వేల్ హాస్పిటల్‌కు తరలించారు.
Tags: mahabubnagar, warangal, sangareddy accident, six people, dead