వరంగల్‌లో కేటీఆర్‌కు చేదు అనుభవం

by Anukaran |   ( Updated:2021-04-11 23:36:20.0  )
వరంగల్‌లో కేటీఆర్‌కు చేదు అనుభవం
X

దిశ ప్రతినిధి, వరంగల్ : వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేట్ మండలం రాంపూర్ గ్రామంలో రోజు వారీ నీటి సరఫరాను ఈరోజు మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. రూ. 2 వేల కోట్ల అభివృద్ధి పనులకు సంబంధించిన శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించనున్నారు. అంతకుముందు వరంగల్‌కు చేరుకున్న కేటీఆర్‌కు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ప్రభుత్వ చీఫ్ విప్, ఎమ్మెల్యే వినయ్ భాస్కర్, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, ఎమ్మెల్యేలు స్వాగతం పలికారు.

కేటీఆర్ పర్యటన నేపథ్యంలో ఏబీవీపీ కార్యకర్తలు కేటీఆర్‌ను అడ్డుకున్నారు. ఏబీవీపీ కార్యకర్తలు వరంగల్లోని రత్న హోటల్ వద్ద కేటీఆర్ కాన్వాయ్ను‌ అడ్డుకున్నారు. ఆకస్మాత్తుగా రోడ్డుపైకి ఏబీవీపీ నాయకులు దూసుకురావడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. దాదాపు 15 నిమిషాల పాటు ఏబీవీపీ కార్యకర్తల నిరసన కొనసాగింది. పోలీసులు ఏబీవీపీ నేతలను లాక్కెళ్తున్న నేపథ్యంలో వారు రోడ్డుపై పడుకున్నారు. ఈ సందర్బంగా రాష్ట్ర ప్రభుత్వానికి, కేసీఆర్‌కు, కేటీఆర్‌కు వ్యతిరేకంగా వారు నినాదాలు చేశారు. 20 మంది ఏబీవీపీ కార్యకర్తలను పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేశారు.

Advertisement

Next Story