ప్రతి ఒక్కరూ ఆయన ఆశయాలు సాధించాలి :ఎబిఎస్ఎఫ్

by Shyam |   ( Updated:2021-11-26 08:32:37.0  )
ప్రతి ఒక్కరూ ఆయన ఆశయాలు సాధించాలి :ఎబిఎస్ఎఫ్
X

దిశ, శాయంపేట: రాజ్యాంగం దినోత్సవం సందర్భంగా శ్యాయం పేటలోని అంబేద్కర్ విగ్రహానికి ఎబిఎస్ఎప్ జిల్లా అధ్యక్షులు మంద నరేష్ పూల మాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశానికి రాజ్యాంగం రాసిన మహనీయుడు అంబేద్కర్ అని కొనియాడారు. ప్రతి ఒక్కరూ అంబేద్కర్ ఆశయాలను సాధించాలని, బహుజన రాజ్యాధికారం వచ్చే వరకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ప్రజలు ఏకమై పోరాడాలని కోరారు.

ఈ కార్యక్రమంలో ఎబిఎస్ఎఫ్ కాకతీయ యూనివర్సిటీ అధ్యక్షులు సాధిరం రాజ్ కుమార్, ఉస్మానియా యూనివర్సిటీ లా విద్యార్థి నేత గుర్రం నరేష్, ఎబిఎస్ఎఫ్ జిల్లా కన్వీనర్ నాగుల పవన్ కళ్యాణ్, ఎబిఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు జెరిపోతుల వంశీ కృష్ణ, బొల్లె వెంకటేష్, ముత్యం నరేష్ శామ్, పండు సాంబయ్య, సత్యం తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story