- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఈగో ప్రాబ్లమ్ లేదు : అభిషేక్
దిశ, వెబ్‌డెస్క్: ‘లూడో’ సినిమాతో లేటెస్ట్‌గా సూపర్ హిట్ అందుకున్న అభిషేక్ బచ్చన్‌కు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. కెరియర్‌లోనే ది బెస్ట్ పర్‌ఫార్మెన్స్ ఇచ్చారని కాంప్లిమెంట్స్ అందుకున్నారు. ఎక్కువగా మల్టీస్టారర్ మూవీస్‌లోనే కనిపించిన అభిషేక్.. యాక్టర్స్ ఈగో అనేది వర్క్‌పై ఎఫెక్ట్ చూపుతుందన్నాడు. ఇతర నటులతో స్క్రీన్ షేర్ చేసుకునేటప్పుడు.. తన కన్నా మరో నటుడి స్క్రీన్ అప్పియరెన్స్ ఎక్కువ సమయం ఉంటే ఇన్‌సెక్యూర్ ఫీల్ అవుతారని చెప్పాడు. అది ఈగోగా లేబుల్ చేయబడుతుందని, కానీ అది మనిషి ప్రాథమిక స్వభావమని.. పూర్తిగా అభద్రతా భావం నుంచి పుట్టిందని మాత్రం అనుకోనని తెలిపాడు.
20 ఏళ్లుగా సినిమాల్లో ఉన్న తాను ఎప్పుడు అలాంటి ఆలోచన రానివ్వలేదన్నాడు. ఈగో కెరియర్‌ను నాశనం చేస్తుందన్న అభిషేక్.. తనకు మాత్రం చాలా మంది నటులతో పనిచేయడం సౌకర్యంగా ఉంటుందన్నాడు. తోటి నటులతో ఒకే ఫ్రేమ్‌లో ఉన్నప్పుడు మనం కూడా కొంత వరకు ప్రతిబింబిస్తామని.. వారి మంచితనం, ప్రతిభ.. మనను మరింత అందంగా కనిపించేలా చేస్తాయన్నాడు.