- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
5 రూపాయిల అన్నం పెట్టలేనోడు సీఎం జగన్.. అబ్ధుల్ అజీజ్ ఫైర్
దిశ, ఏపీ బ్యూరో: పేద ప్రజలు తినే 5 రూపాయల అన్నాన్ని కూడా లాక్కున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ రాష్ట్ర ప్రజల బిడ్డలకు ఏ విధంగా బంగారు భవిష్యత్తు వేస్తాడని నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ ప్రశ్నించారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 25వ డివిజన్‌లో టీడీపీ అభ్యర్థి మాతంగి కృష్ణను గెలిపించాలని విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైసీపీ పాలనలో అరాచకాలు రాజ్యమేలుతున్నాయన్నారు. నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికల సమయంలో మంత్రి అనిల్, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిలు చేసిన దౌర్జన్యాలూ ఆగడాలను నెల్లూరు జిల్లా ప్రజలందరూ చూశారన్నారు.
ఇంటి పన్నులు ఇష్టారాజ్యంగా పెంచి వేశారని, కరోనా సమయంలో అల్లాడిపోతూ ఉంటే మరో వైపు చెత్త పన్ను వేశారని ధ్వజమెత్తారు. టీడీపీ హయాంలో ఇచ్చిన పింఛన్లను రకరకాల సాకుతో తొలగించారన్నారు. చివరకు వికలాంగులు.. మానసిక వైకల్యంతో బాధపడే వారి ఫించన్లు కూడా తొలగించడం ఈ ప్రభుత్వ దుర్మార్గానికి నిదర్శనమన్నారు. విచ్చలవిడిగా డబ్బు ఖర్చు చేసి కార్పొరేషన్ ఎన్నికల్లో గెలవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుట్రపన్నుతోందని వీరందరికి ఓటు ద్వారా సరైన బుద్ధి చెప్పాల్సిన సమయం ఆసన్నమైందని అబ్ధుల్ అజీజ్ పిలుపునిచ్చారు.