- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘ఆలన’ వాహనాల ప్రారంభం : వేముల
దిశ , నిజామాబాద్: అసంక్రమిత వ్యాధుల జిల్లా ప్రజలను రక్షించేందుకు వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ప్రజల చెంతకు వైద్యాన్ని తీసుకెళ్లే కార్యక్రమం ‘ ఆలన’ ను మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రారంభించారు. బుధవారం జిల్లా కేంద్రంలోని రోడ్లు భవనాల శాఖ గెస్ట్ హౌజ్ వద్ధ ఆలన వాహనాలను జెండా ఉపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఆసంక్రమిత వ్యాధిగ్రస్థులను గుర్తించి వారి ఇంటి వద్ధకు వెళ్లి వైద్యుడు, ఏఎన్ఎం, స్టాఫ్ నర్సులు చికిత్స అందిస్తారని తెలిపారు. బాల్కొండ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ పరిధిలోని కమ్మర్ పల్లి, చౌట్‌పల్లి, వేల్పూర్, కిసాన్ నగర్, మెండోరా, మోర్తాడ్ మండలాల్లో ఈ ఆలన సేవలను ప్రారంభించినట్లు వివరించారు. ప్రజలకు చికిత్స అందించి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకు రావాలని మంత్రి వైద్యులకు సూచించారు.కార్యక్రమంలో డీఎంహెచ్వో డాక్టర్ సుదర్శనం, ప్రోగ్రాం ఆఫీసర్ డా. శంభు తదితరులు పాల్గొన్నారు.