- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
యువతిపై కన్నేసిన యువకుడు.. బట్టలు ఉతుకుతున్న ఆమెపై ఒక్కసారిగా..
దిశ, వెబ్‌డెస్క్ : గుంటూరులో రమ్య సంఘటన మరవక ముందే సూర్యాపేట జిల్లాలో మరో ఘటన చోటు చేసుకుంది. ఓ యువకుడు యువతి గొంతు కోసిన ఘటన జిల్లాలోని నేరేడు చర్లలో జరిగింది. వివరాల్లోకి వెళ్లితే.. గుంటూరు జిల్లా సంచార జాతికి చెందిన ఒక కుటుంబం ఇటీవల నేరేడుచర్ల పట్టణానికి బతుకు తెరువు కోసం వచ్చారు. పట్టణంలోని రాజీవ్ నగర్ కాలనీలో నివాసం ఉంటున్నారు. బుడగ జంగాల కుటుంబాలకు చెందిన 24 సంవత్సరాల కళ్యాణి అనే యువతిపై అదే కులానికి చెందిన నేరేడుచర్ల పట్టణంలోని గాంధీ నగర్‌కు చెందిన బాల సైదులు 25 సంవత్సరాలు అనే యువకుడు బ్లేడుతో దాడి చేసి అమ్మాయి గొంతు కోసాడు.
అయితే అమ్మాయికి కొన్ని రోజుల క్రితమే వేరే అబ్బాయితో పెళ్లి కుదరడం జరిగింది. ఆ అమ్మాయి బట్టలు ఉతకడానికి వాళ్ళ ఇంటికి కొద్ది దూరంలో ఉన్న కాలువ దగ్గరికి వెల్లింది. ఇది గమనించిన యువకుడు ఆ అమ్మాయి వెనకాల వెళ్ళాడు అమ్మాయి ఒంటరిగా ఉండటంతో నాతో రా అని బలవంతం చేయసాగాడు. ఆ అమ్మాయి తిరస్కరించడంతో బ్లేడుతో మెడపై కోసి అక్కడి నుంచి పరారయ్యాడు. ఇది గమనించిన స్థానికులు అమ్మాయిని అంబులెన్స్‌లో చికిత్స నిమిత్తం మిర్యాలగూడ ఆస్పత్రికి తరలించారు.