- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
నా భర్తకు ఇంజక్షన్ ఇవ్వడం లేదు.. నేను చచ్చిపోతా
దిశ, వెబ్‌డెస్క్: ఒక వైపు కరోనా కేసులు తగ్గుతున్నందుకు ఆనందపడాలో.. బ్లాక్ ఫంగస్ కేసులు పెరుగుతున్నందుకు భయపడాలో అర్థంకాని పరిస్థితిలో ఉన్నారు ప్రజలు. బ్లాక్ ఫంగస్ కేసులు రోజురోజుకు ఎక్కువవుతున్నాయి. దాన్ని తగ్గించడానికి కావాల్సిన ఇంజెక్షన్లు అందుబాటులో లేకపోవడంతో ఎంతోమంది మృత్యువాతపడుతున్నారు. తాజాగా తన భర్తకు యాంఫోటెరిసిన్–బి ఇంజెక్షన్లు ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటానని ఓ భార్య రోడ్డెక్కింది. ఈ విషాద ఘటన మధ్యప్రదేశ్ లో వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్ రాష్ట్రం ఇండోర్‌లోని బాంబే హాస్పిటల్‌లో 40 ఏళ్ళ ఓ వ్యక్తి బ్లాక్ ఫంగస్ లక్షణాలతో హాస్పిటల్లో చేరాడు. వైద్యులు అతనికి బ్లాక్ ఫంగస్ చికిత్సలో భాగంగా ఇప్పటికే యాంఫోటెరిసిన్–బి ఇంజెక్షను ఇచ్చారు. ఇలా రెండు రోజులు నుండి ఇంజెక్షన్లు ఇస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మరికొన్ని ఇంజెక్షన్లు ఇవ్వాల్సి ఉండగా.. హాస్పిటల్లో ఇంజెక్షన్స్ స్టాక్ లేకపోవడంతో అతనికి చికిత్స నిలిపివేశారు. దీంతో సదరు రోగి భార్య ఆవేదన వ్యక్తం చేసింది.
తన భర్తకు ఇంజెక్షన్ ఇవ్వకపోతే తాను ఆత్మాహత్య చేసుకొంటానని వైద్యులను బెదిరించింది. ప్రస్తుతం ఆమె వీడియో నెట్టింట వైరల్ గా మారింది. “బాంబే హాస్పిటల్ లో నా భర్త బ్లాక్ ఫంగస్ తో పోరాడుతున్నాడు.. ఆసుపత్రిలో ఇంజెక్షన్లు లేవని వైద్యులు చేతులేశారు. ఆయనకు కళ్లు, దవడల్లో విపరీతమైన నొప్పి వస్తోంది. ఇక్కడ యాంఫోటెరిసిన్–బి ఇంజెక్షన్లు లేవు. ఈ స్థితిలో నా భర్తను ఎక్కడికి తీసుకెళ్లగలను?.. ఈరోజు కనక నా భర్తకు ఇంజెక్షన్ ఇవ్వకపోతే నేను ఆత్మహత్య చేసుకుంటా.. అంతకు మించిన మార్గం నాకు కనిపించడం లేదంటూ” వాపోయింది. ఇక ఈ వీడియో పై స్పందించిన ఆసుపత్రి వర్గాలు.. ఆమె భర్త ఆరోగ్యం క్షీణించడంతో ఆమె మానసికంగా కుంగిపోయిందని. తమ వద్ద స్టాక్ లేని కారణంగానే ఇంజెక్షన్ ఇవ్వలేదని తెలిపారు.