శ్రీలక్ష్మిగా మారి, శ్రీనివాస్‌ను పెళ్ళాడి.. చీరల మాటున చాటుగా.. 

by Anukaran |   ( Updated:2021-03-21 06:01:37.0  )
శ్రీలక్ష్మిగా మారి, శ్రీనివాస్‌ను పెళ్ళాడి.. చీరల మాటున చాటుగా.. 
X

దిశ, వెబ్ డెస్క్: ఆమె పేరు శ్రీలక్షి. కాదు, కాదు.. షేక్ లాల్ బి. చేసేది చీరల వ్యాపారం. కాదు, కాదు.. చీరల వ్యాపారం మాటున చీకటి వ్యాపారం. అమాయకపు మహిళలు చీరలు కొనుక్కుందామని వెళ్తే… వారితో నైస్ గా మాట్లాడి, నీట్ గా వ్యాపారంలోకి దింపి సొమ్ము చేసుకుంటోంది. ఇలా తన దగ్గరకి వచ్చిన మహిళలతో సీక్రెట్ గా సాగిస్తున్న అక్రమ వ్యాపారానికి పోలీసులు చెక్ పెట్టారు. అరెస్టు చేసి అసలు విషయాలు బయటపెట్టారు.

పోలీసుల వివరాల ప్రకారం… గుంటూరుకు చెందిన షేక్ లాల్ బి చీరల వ్యాపారం చేస్తుంటుంది. అయితే ఆమె తన పేరు శ్రీలక్ష్మిగా మార్చుకుని, శ్రీనివాస్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. శ్రీలక్ష్మి అనే పేరుతోనే చీరాల వ్యాపారం మొదలుపెట్టింది. డబ్బు మీద వ్యామోహంతో సులభంగా డబ్బు సంపాదించేందుకు అక్రమ మార్గం ఎంచుకుంది. తన దగ్గర చీరలు కొనేందుకు వచ్చే అమాయకపు మహిళలకు డబ్బులు ఆశగా చూపి… వారిని ఆ వ్యాపారంలోకి లాగింది.

చీరల దుకాణం అంటే ఎక్కువమంది ఆడవాళ్లు వస్తుండటం కామన్. కానీ ఈమె దుకాణానికి ఆడవాళ్లకంటే మగవాళ్ల తాకిడి ఎక్కువైంది. దీంతో చుట్టుపక్కలవారికి అనుమానాలు మొదలయ్యాయి. పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో నిఘా ఉంచిన పోలీసులకు అసలు విషయం ఏంటో తెలిసిపోయింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు, ఆ దుకాణంపై దాడి చేసి మొత్తం ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు.

Advertisement

Next Story