భర్త పొగాకు తినొద్దన్నాడనీ.. భార్య ఏం చేసిందో తెలుసా?

by Sumithra |   ( Updated:2021-04-12 04:48:56.0  )
భర్త పొగాకు తినొద్దన్నాడనీ.. భార్య ఏం చేసిందో తెలుసా?
X

దిశ, వెబ్ డెస్క్: కుటుంబంలో కలహాలు ఉండడం సాధారణం.. ఈ కలతలు వలన చాలామంది తీవ్ర మనస్థాపానికి గురవుతున్నారు. చిన్న చిన్న కారణాలతోనే ప్రాణాలను తీసుకొని .. పిల్లలను అనాధలను చేస్తున్నారు. తాజాగా ఒక చిన్న గొడవ ఇద్దరు చిన్నారులకు తల్లిని దూరం చేసింది. వివరాలలోకి వెళితే మంచిర్యాల దండేపల్లికి చెందిన ఎనగందుల సత్యనారాయణకు, గద్దె రాగడికి చెందిన జ్యోతి(30)తో 2012లో వివాహమైంది. వీరికి శశ్మిత, హర్షిణి అనే ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. అయితే చిన్నతనం నుండి జ్యోతికి పొగాకు తినే అలవాటు ఉంది. ఎన్నిసార్లు, ఎంతమంది చెప్పినా ఆ అలవాటును ఆమె మానుకోలేకపోయింది.

పెళ్లి తర్వాత కూడా అదే అలవాటు వ్యసనంగా మారింది. దీంతో పొగాకు అలవాటు గురించి రోజు ఇంట్లో గొడవ జరుగుతుండేది. శనివారం కూడా ఈ విషయమై భార్యాభర్తలు గొడవ పడ్డారు. ఈ నేపథ్యంలో కలతచెందిన జ్యోతి పిల్లలను పక్కింటికి పంపి ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. తల్లి శవం వద్ద ఇద్దరు చిన్నారులు ఏడుస్తున్న దృశ్యం అందరి కంట కన్నీరు తెప్పించింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

Advertisement

Next Story

Most Viewed