- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
కష్టాలు తొలగాలంటే.. దీంతో తొక్కించుకోవాలంటా
దిశ, వెబ్ డెస్క్ : భారతదేశంలో విభిన్న రకాలైనా ఆచారాలు సాంప్రదాయాలు ఉంటాయి. అయితే ఈ ఆచార సంప్రదాయాలు ఒక్కో ప్రాంతాన్నిబట్టి మారుతూ ఉంటాయి. కొన్ని కొన్ని తెగల్లో వింత ఆచారాలు ఉంటాయి. ఉదాహరణకు ఉత్తరప్రదేశ్ లో హోలి పండగరోజు మగవాళ్లు ఆడవారిగా తయారయ్యి పూజలు చేయడం లాంటి ఆచారాలను ఈ కంప్యూటర్ యుగంలోను వారు పాటిస్తుంటారు. ఇలా చేస్తే వారి ఊరికి ఉన్న అరిష్టం పోతుందని, వారి కష్టాలు తొలిగిపోతాయని వారి నమ్మకం.
అయితే ఇలానే తూర్పుగోదావరి జిల్లాలో వింత ఆచారం ఉంది. అదేంటి అనుకుంటున్నారా..? మనం కష్టాలు తొలగాలని గుడికి వెళ్లి దేవున్ని మొక్కుకొని వస్తాము. కానీ ఊరిఅరిష్టం పోవాలని, కష్టాలు తీరాలని దున్నపోతుతో తొక్కించుకుంటున్నారు భక్తులు. ఎంటీ దున్నపోతుతో తొక్కించుకుటే కష్టాలు తొలిగిపోతాయా.. ఇదేం విచిత్రం.. ఇది ఎక్కడా అనుకుంటున్నారా..? ఊరికి అరిష్టం పోవాలని, తమ కష్టాలు తీరాలని పెద్ద ఎత్తున భక్తులు బారులు తీరి పడుకుని దున్నపోతుతో తొక్కించుకుటున్నారు. అయితే ఈ వింత ఆచారం తూర్పుగోదావరి జిల్లా యు.కొత్తపల్లి మండలం అమీనాబాద్‌లో జరిగే పోలేరమ్మ తీర్థంలో పూర్వం నుంచే కొనసాగుతోంది. ఈ ఉత్సవంలో ఉదయం నుంచి ఉపవాసం ఉన్న భక్తులు, గ్రామస్తులు తొలుత అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం దున్నపోతుకు పూజలు చేసి, గరగ నృత్యాల మధ్య గ్రామంలో ఊరేగించి, ఆలయం వద్దకు తీసుకువచ్చారు. ఉపవాసం ఉన్న భక్తులందరూ పసుపు నీళ్లతో స్నానం చేసి, అమ్మవారి ఆలయం ఎదురుగా బారులు తీరి పడుకున్నారు.వెంటనే ఆ దున్నపోతును తీసుకుని ఒక భక్తురాలు పడుకున్న వారి మీదుగా నడిపించింది. భక్తులు ఇలా మూడుసార్లు దున్నపోతుతో తొక్కించుకున్నారు.