అతడి వల్లే ఈ ఘటన…!

by Sumithra |   ( Updated:2022-08-22 10:22:40.0  )
అతడి వల్లే ఈ ఘటన…!
X

దిశ, మెదక్: అక్కడ తెల్లతెల్లవారుతున్నది.. సంతోషంగా వారు ముందుకెళ్తున్నారు. కానీ, ఈ సమయంలో అనుకోకుండా ఓ సంఘటన ఎదురైంది. దీంతో అప్పటి వరకు తమతో కలిసి ఉన్న ఆ ఇద్దరు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. దీంతో వాళ్లంతా కన్నీరుమున్నీరయ్యారు. ఆదివారం తెల్లవారు జామున జిల్లాలో ఓ డ్రైవర్ అజాగ్రత్త వల్ల జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతిచెందగా ఐదుగురికి గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళితే.. మెదక్ జిల్లా నర్సాపూర్ అడవి ప్రాంతంలోని అర్భన్ పార్క్ వద్ద రెండు ఆటోలను టిప్పర్ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకుని ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు.. మృతులు శ్రీహరి(35), బోహిని నర్సింహులు(44)గా గుర్తించారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. టిప్పర్ డ్రైవర్ అజాగ్రత్తగా వాహనం నడపటం వల్లే ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు సమాచారం.

Advertisement

Next Story