- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సౌదీలో చిక్కుకున్న జగిత్యాల వాసి.. కాపాడాలంటూ మోడీ, కేసీఆర్‌కు వినతి(వీడియో)
దిశ ప్రతినిది, కరీంనగర్: కడుపున పుట్టిన బిడ్డను, కని పెంచిన తల్లిదండ్రులను, కట్టుకున్న భార్యకు బుక్కెడు బువ్వ పెట్టాలన్న ఆశ. తన కుటుంబ ఆర్థిక అవసరాలకు తగ్గట్టుగా కను చూపు మేరలో ఉపాధి దొరికే అవకాశం లేక, ఓ యువకుడు అప్పు చేసి విమానం ఎక్కాడు. సౌదిలో డ్రైవర్‌గా పనికి కుదిరిన ఆ యువకుడు యజమాని పెడుతున్న కష్టాలు తట్టుకోలేకపోతున్నానని తనను ఇండియాకు రప్పించాలంటూ వేడుకుంటున్నాడు.
వివరాల్లోకి వెళ్లితే.. జగిత్యాల జిల్లా రాయికల్ మండలం ధర్మాజీపేట గ్రామానికి చెందిన నగావత్ సురేందర్ రెండేళ్ల క్రితం సౌదీకి వెళ్ళాడు. అక్కడ ఫ్యామిలీ డ్రైవర్‌గా పని చేస్తున్న సురేందర్ ఆరు నెలల క్రితం ఓ యాక్సిడెంట్‌కు బాధ్యున్ని చేస్తూ అప్పటి నుంచి అతన్ని అక్కడే నిర్భందించారు. పాస్ పోర్టు తీసుకున్న యజమాని 6500 రియాల్స్ డబ్బు కూడా తీసుకున్నారు. కరోనా వచ్చి ఇబ్బంది పడ్డప్పుడు స్నేహితుల సాయంతో బతికానని సురేందర్ వివరించాడు. ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్‌లు జోక్యం చేసుకుని తనను ఇండియాకు రప్పించేందుకు సహకరించాలని సురేందర్ కోరుతున్నాడు.
డిప్రెషన్‌తో ఆత్మహత్య చేసుకునే పరిస్థితి తయారైందని, తాను దమామ్ జుబేల్ రాయల్ కమిషన్‌లో ఉంటున్నానని, తన పాస్ పోర్టు ఇవ్వాలని కోరుతున్నా తనను ఉద్యోగంలో పెట్టుకున్న మేడం కేసు పెట్టుకో కానీ పాస్ పోర్టు ఇవ్వనని బెదిరిస్తున్నారని సురేందర్ వివరించారు. తినడానికి తిండి లేక అవస్థలు పుడుతున్నానని తనను ఎలాగైనా ఇండియాకు తీసుకెళ్లేందుకు సహకరించాలని కోరుతున్నాడు. ఉద్యోగం చేయమంటున్నారు కానీ, నేనిక్కడే డ్రైవర్‌గా పని చేయాలంటున్నారు. కానీ తనకు భయం వేస్తోందని, తన తల్లిదండ్రులు, కూతురు గుర్తుకు వస్తున్నారని, సౌదిలో తనకు తిండి గింజలు కూడా లేవని స్వగ్రామానికి తీసుకెళ్లేందుకు సహకరించాలని సురేందర్ కోరారు. ఓ మిత్రుడు సహకారంతో మొబైల్‌లో డాటా సపోర్ట్ కార్డు వేయించుకుని ఈ వీడియో పంపిస్తున్నాని తనకు సహకరించాలని సురేందర్ చేతులు జోడించి వేడుకుంటున్నాడు.