- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
100 ఏళ్ల తర్వాత.. అస్సాంలో అందమైన బాతు
దిశ, ఫీచర్స్ : అస్సాంలోని టిన్సుకియా జిల్లాలో ‘మాగురి మోటాపుంగ్ బీల్’ లేదా మాగురి బిల్ అనేది ఓ సరస్సు. వన్యప్రాణులకు సహజ నివాసంగా ఉన్న ఈ సరస్సు.. డిబ్రూ నదికి దక్షిణ ఒడ్డున అనేక రకాల పక్షులకు ఆలవాలంగా విలసిల్లుతోంది. అయితే 304కు పైగా నివాస, వలస పక్షి జాతులు గల ఈ ప్రదేశంలో గత వారం మాండరిన్ బాతు కనిపించడం విశేషం. 100 సంవత్సరాల తర్వాత కనిపించిన ఈ బాతు, స్థానికులను విపరీతంగా ఆకర్షించింది. ఇక ప్రపంచంలోనే అందమైన బాతుగా ‘మాండరిన్ బాతు’కు పేరుండగా.. 1902 తర్వాత మళ్లీ ఇప్పుడే ఈ పక్షి ఇక్కడ కనిపించిందని, ఇది తననెంతో ఆశ్చర్యానికి, ఆనందానికి గురిచేసిందని స్థానిక బర్డ్ గైడ్ బినంద హతిబోరువా తెలిపాడు. మరి మాండరిన్ బాతు విశేషాలేమిటి? స్థానికులు ఎందుకు అంతగా ఎగ్జైట్ అవుతున్నారు?
ప్రపంచంలోనే అత్యంత అందమైన బాతుగా పరిగణించబడుతున్న మాండరిన్ బాతు లేదా ఐక్స్ గాలెరికులాటాను స్వీడిష్ వృక్షశాస్త్రజ్ఞుడు, వైద్యుడు, జంతు పరిశోధకుడైన కార్ల్ లిన్నెయస్.. 1758లో తొలిగా గుర్తించాడు. ఇది ఈస్ట్ ఆసియాకు చెందిన పక్షి కాగా, ఎరుపు వర్ణపు ముక్కు, నలుపు నీలం రంగులో కలయికలో మెరిసిపోయే తోక, ఆకట్టుకునే జూలు జుట్టుతో అనేక రంగుల మేళవింపుగా ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. ఆడ మాండరిన్ బాతుతో పోల్చితే, మగ బాతులు మరింత ఆకట్టుకునే రంగుల్లో ఉంటాయి. రష్యా, కొరియా, జపాన్‌తో పాటు చైనాలోని ఈశాన్య భాగాల్లో ఈ బాతులు ఎక్కువగా కనిపిస్తాయి. ఇటీవల కాలంలో వెస్ట్రర్న్ యూరప్, అమెరికాలోనూ కనిపిస్తున్న ఈ మాండరిన్ డక్స్.. చాలా అరుదుగా ఇండియాను సందర్శిస్తుంటాయి. ఇప్పటివరకు 1902లో టిన్సుకియా, రోంగగోరా ప్రాంతంలోని డిబ్రూ నదిలో ఇది కనిపించినట్లు రికార్డుల్లో వెల్లడి కాగా, 2013లో మణిపూర్‌లోని లోక్టక్ సరస్సులో, ఆ తర్వాత 2014లో అస్సాం- బక్సా జిల్లాలోని ‘మనస్ నేషనల్ పార్క్ అండ్ టైగర్ రిజర్వ్’లో కనిపించింది.
ప్రపంచవ్యాప్తంగా ముప్పు లేని జాతి కానప్పటికీ, ఈ బాతులు కనిపించడం ఎప్పుడూ ప్రత్యేకమేనని, ఎందుకంటే ఇవి అరుదుగా మాత్రమే మనల్ని కనువిందు చేస్తాయని అటవీ శాఖ మాజీ జాయింట్ సెక్రటరీ, బర్డ్ సైంటిస్ట్ డాక్టర్ అన్వరుద్దీన్ చౌదరి తెలిపాడు. ‘పక్షులు సాధారణంగా వలసల కోసం రెగ్యులర్ రూట్‌ను మాత్రమే అనుసరిస్తుంటాయి. కానీ అవి తమ రెగ్యులర్ మార్గం నుంచి తప్పుకోవడం కూడా అంతే సాధారణం. బహుశా ప్రమాదవశాత్తు ఈ బాతు దారి తప్పి ఉండవచ్చు లేదా తమ గ్రూప్ నుండి దూరమై ఉండవచ్చు’ అని డాక్టర్ చౌదరి అన్నారు. ఇది చారిత్రక వీక్షణ అని, ప్రత్యేకించి మనం మళ్లీ ఈ బాతులను ఎప్పుడు చూస్తామో! ఎవ్వరూ చెప్పలేమని బర్డ్ గైడ్ బినంద హతిబోరువా పేర్కొన్నాడు. ఇక మాండరిన్ బాతు ముంబై, ఢిల్లీ, కోల్‌కతా, పుణెతో సహా దేశంలోని వివిధ ప్రాంతాల్లో గతంలో కనిపించడం విశేషం.