- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
‘ఆవుకు వైభవంగా సీమంతం’ చేసి మురిసిపోయిన రైతు..
దిశ, ముధోల్: మూగజీవాలకు మనిషివలె స్థానం కల్పించి, తమ కుటుంబంలో ఒక ఆడపడుచుగా భావించి అల్లారుముద్దుగా పెంచుకుంటున్న ఆవుకి శ్రీమంతం వేడుకలు నిర్వహించారు ఓ రైతు. వివరాల్లోకి వెళితే.. కుబీర్ మండలం పల్సి గ్రామంలో పురంశెట్టి శ్రీరాములు అనే రైతుకు ఇద్దరు ఆడపిల్లలు. వారితో పాటు తమ ఆవుని కూడా సొంత కూతురిలా పెంచుకుంటున్నారు. ఈ క్రమంలో ఆ ఆవు గర్భం దాల్చింది. ఇక వారి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. దీంతో వారు ‘ఆవుకు వైభవంగా సీమంతం’ చేశారు. తన కూతురికే సీమంతం చేస్తున్నంత వైభవంగా వేడుక చేశారు.
సోమవారం ఆ రైతు చేసిన సీమంతం శుభకార్యాన్ని గ్రామ ప్రజలు చూసి ఆశ్చర్యపోయారు. కన్న కూతురికి ఏవిధంగా అయితే సీమంతం చేస్తారో.. తాను పెంచుకుంటున్న ఆవుకి కూడా సీమంతం చేశారు. సీమంతం వేళ ఏ విధంగా ముస్తాబు చేస్తారో ఆ విధంగా ముస్తాబు చేసి వేడుక నిర్వహించారు. ఈ సీమంతం కార్యక్రమానికి గ్రామంలోని ముత్తైదువులు, వనితలు వచ్చి వేద పండితుల విజయ్ కుమార్ సమక్షంలో హారతులు పూజా కార్యక్రమాలు నిర్వహించి ఆవును ఆశీర్వదించారు.