- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సెల్ టవర్ ఎక్కాడు: సమస్య కొలిక్కి
దిశ, కరీంనగర్: చట్టాలు చేసే ప్రజాప్రతినిధులే తన భూమిని కబ్జా చేశారని.. ఎలాగైనా తన భూమిని రక్షించుకోవాలని అధికారులు, మంత్రుల క్యాంపు కార్యాలయాల చుట్టూ చెప్పులు అరిగేలా తిరిగినా ఫలితం లేకపోయింది. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన మాదాసి లక్ష్మయ్య అనే వ్యక్తి సెల్ టవర్ ఎక్కాడు. ఈ ఘటన కరీంనగర్ రూరల్ మండలం బొమ్మకల్‌లో చోటుచేసుకుంది. తన భూమిని బొమ్మకల్‌కు చెందిన మాజీ వార్డ్ మెంబర్‌తో పాటు రేకుర్తికి చెందిన మరో ప్రజాప్రతినిధి కలిసి కబ్జాకు పాల్పడ్డారంటూ మాదాసి లక్ష్మయ్య ఆరోపించారు. గతంలో ఇదే విషయంపై మంత్రి గంగుల క్యాంపు కార్యాలయం ముందు లక్ష్మయ్య పురుగుల మందు డబ్బాతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. భూ కబ్జాలో విషయంలో కరీంనగర్‌కు చెందిన మాజీ కార్పోరేటర్ కట్ల సతీష్ హస్తం ఉన్నట్లు బాధితుని బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం లక్ష్మయ్య సెల్ టవర్ ఎక్కాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు రెవెన్యూ అధికారులు బొమ్మకల్ చేరుకొని.. సమస్య పరిష్కరిస్తామని నచ్చజెప్పడంతో లక్ష్మయ్య టవర్ నుంచి కిందకు దిగాడు.