- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
టీనాకు పోలీసుల గౌరవ వందనం
దిశ, క్రైమ్ బ్యూరో : సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో దాదాపు పదేళ్లు డాగ్ స్క్వాడ్ లో సేవలందించిన ‘‘టీనా’’ అనారోగ్యంతో మృతి చెందడంతో సీపీ సజ్జనార్ నేతృత్వంలో బుధవారం ఘనంగా అంత్యక్రియలు నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసులు మూడు రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపి గౌరవ వందనం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో డీజీపీ అనురాగ్ శర్మ, సైబరాబాద్ మాజీ సీపీలు సీవీ ఆనంద్, సందీప్ శాండిల్యా పని చేసిన సమయంలో టీనా సేవలందించింది. 2011లో పుట్టిన టీనా 2012వ బ్యాచ్ లో మొయినాబాద్ ఐఐటీఏ లో పేలుళ్లను కనిపెట్టడంలో స్నిఫర్ డాగ్ గా శిక్షణ పొందింది. శిక్షణ కాలంలో రెండో ఉత్తమ విజేతగా నిలవడమే కాకుండా, రెగ్యులర్ విధుల్లో భాగంగా పలు బాంబు తనిఖీలు చేసింది.
ఈ సందర్భంగా వీఐపీ, వీవీఐపీ, ఆర్ఓపీ, యాంటీ సాబోటేజ్, శంషాబాద్ విమానాశ్రయం తనిఖీలు, 2014 మే 8న జేఎన్టీయూలో బాంబు బెదిరింపు వచ్చిన కాల్ సమయంతో పాటు అనేక ఇతర బాంబు తనిఖీల డెమోల్లో టీనా పాల్గొంది. 2017 బయోడైవర్సిటీ కాప్ -2 కార్యక్రమానికి ఇవాంకా ట్రంప్ ముఖ్య అతిథిగా విచ్చేసిన సమయంలో కూడా టీనా విధులు నిర్వహించడం విశేషం. గతేడాది ఆగస్టు 23న రిటైర్మెంట్ పొందిన టీనా అనారోగ్యంతో బాధపడుతూ బుధవారం మరణించింది. ఈ సందర్భంగా సీపీ సజ్జనార్, ఇతర పోలీసు అధికారులు టీనాకు పుష్పగుచ్ఛం ఉంచి ఘనంగా నివాళి అర్పించారు. పదేళ్ల కాలంలో టీనా అందించిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ డీసీపీ ఎస్ఎం విజయ్ కుమార్, సీఏఆర్ హెడ్ క్వార్టర్స్ అడిషనల్ డీసీపీ మాణిక్ రాజ్, సిటీ సెక్యూరిటీ వింగ్ అడిషనల్ డీసీపీ వెంకట్ రెడ్డి, ఏసీపీ లక్ష్మీనారాయణ, ఏసీపీ సంతోష్, డాగ్ స్క్వాడ్ హెడ్ కానిస్టేబుల్ మధుసూదన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.