'కెప్టెన్ కూల్'.. డోంట్ రిపీట్ ప్లీజ్

by Shiva |   ( Updated:2021-04-16 06:13:12.0  )
కెప్టెన్ కూల్.. డోంట్ రిపీట్ ప్లీజ్
X

దిశ, వెబ్‌డెస్క్: కెప్టెన్ కూల్‌గా అందరూ పిలుచుకునే టీమిండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ ప్రస్తుత కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీకి ఎంతమంది క్రికెట్ ఫ్యాన్స్ ఉన్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రస్తుత ఐపీఎల్‌లో ధోనీ బ్యాటింగ్ చూసేందుకు ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ప్రస్తుత ఐపీఎల్‌లో ధోనీపై నాలుగు మ్యాచ్‌ల నిషేధం ముప్పు పొంచి ఉండటం అభిమానులను కలవరపరుస్తోంది.

ఈ ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్ కారణంగా ధోనీకి మ్యాచ్ రిఫరీ ఏకంగా రూ.12 లక్షల జరిమానా విధించాడు. అదే తప్పు రెండోసారి రిపీట్ చేస్తే నాలుగు మ్యాచ్‌ల నిషేధం విధిస్తారు. దీంతో ఇవాళ పంజాబ్ కింగ్స్‌తో చెన్నై సూపర్ కింగ్స్ ఆడనున్న మ్యాచ్‌పై అందరి దృష్టి పడింది.

ఈ మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్ నమోదు కాకుండా కెప్టెన్ ధోనీ జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఐసీసీ నిబంధనల ప్రకారం నిర్ణీత సమయంలోపు మ్యాచ్‌ను పూర్తి చేయాల్సి ఉంది. ఒకసారి ఆలస్యం చేస్తే రూ.12 లక్షల జరిమానా విధిస్తారు. రెండోసారి రిపీట్ అయితే కెప్టెన్‌పై రెండు నుంచి నాలుగు మ్యాచ్‌ల నిషేధం విధిస్తారు.

Advertisement

Next Story

Most Viewed