- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కడుపు మంటతో పంటకు నిప్పు పెట్టిన రైతు (వీడియో)
దిశ, పెద్దపల్లి: పెద్దపల్లి జిల్లాలో హృదయ విదారకర ఘటన చోటుచేసుకుంది. రైతుల పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తోన్న తీరుపై అసహనం వ్యక్తం చేస్తూ కడుపు మంటతో ఓ రైతు పంటకు నిప్పుపెట్టాడు. ఈ ఘటన గురువారం పెద్దపల్లి జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. జిల్లాలోని చంద్రపల్లి గ్రామానికి చెందిన రైతు తోట పెద్దన్న రాష్ట్ర ప్రభుత్వం సన్న వడ్లు వేయాలని చెప్పడంతో తన రెండున్నర ఎకరాల్లో సన్నవడ్లు సాగుచేశాడు. చీడ పురుగు, దోమకాటు వస్తే అప్పులు తీసుకొచ్చి మరీ మందులు కొట్టించాడు.
అయినా, ఫలితం లేకుండా పోయిందని వాపోయాడు. దీంతో చేతికొచ్చిన పంటను కోపిస్తే కనీసం హర్వెస్టర్ ఖర్చు వెళ్లలేని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశాడు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మొండివైఖరి వీడి, ఇకనైనా రైతుల గోసను గుర్తించాలని వేడుకున్నాడు. ప్రభుత్వాల రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా సుమారు రూ.2 లక్షల విలువైన తన పంటకు నిప్పు పెట్టాడు. తోటి రైతులు ఎంత చెప్పినా వినకుండా, రైతు తోట పెద్దన్న తన పొలానికి నిప్పు పెట్టడం స్థానికంగా కలకలం సృష్టించింది. ప్రభుత్వం ఇకనైనా రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.