- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రెవెన్యూ అధికారులకు లంచం.. భిక్షాటన చేస్తున్న యువరైతు
దిశ, వెబ్ డెస్క్: ఎంఎస్సీ చదివి వ్యవసాయం చేస్తున్న యువరైతుకు రెవెన్యూ అధికారులు చుక్కలు చూపిస్తున్నారు. 8 ఎకరాల భూమి ఉన్న యువరైతు భిక్షాటన చేయడం రాష్ట్రవ్యాప్తంగా చర్చాంశనీయంగా మారింది. మంచిర్యాల జిల్లా తాండూర్ గ్రామానికి చెందిన యువరైతు తౌటం రాజేంద్రప్రసాద్ భూమి విషయంలో తనకు అన్యాయం జరిగిందని, రెవెన్యూ అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చేసేది లేక అధికారులకు లంచం ఇచ్చేందుకు తన వద్ద డబ్బులు లేవని, వారికి డబ్బులు ఇచ్చేందుకు భిక్షాటన చేస్తున్నట్లు చెబుతున్నాడు.
తాండూర్ శివారులోని 612/అ/5, 612/5/అ సర్వే నెంబర్లలో 8 ఎకరాల భూమికి సంబంధించి అన్ని రకాల పత్రాలు ఉన్నాయి. ఓ వైపు కబ్జా దారుల బెదిరింపు, మరోవైపు ఆన్ లైన్ లో తన భూమికి సంబంధించి వివరాలు లేకపోవడం అనుమానాలకు తావిస్తోందన్నారు.
ప్రజావాణిలో ఫిర్యాదు చేసినా ఫలితం లేదని, అధికారులకు లంచం ఇస్తే పని జరుగుతుందేమోనన్న ఆశతో ఈ పని చేస్తున్నట్లు రైతు రాజేంద్రప్రసాద్ వాపోతున్నారు. ఇదే విషయంపై తహశీల్దార్ కవితను వివరణ కోరగా.. బాధితుడి భూమి వివాదంలో ఉందని, నివేదికలు తయారు చేసి ఉన్నతాధికారులకు అందించామన్నారు. ఇక వివాదంలో ఉన్న భూములు ధరణి వెబ్‌సైట్‌లో కేటగిరి పార్టు-బి లో ఉండడంతో సమస్యను పరిష్కరించలేకపోతున్నట్లు తహశీల్దార్ కవిత తెలిపారు.