- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎందుకోయ్ అంత కోపం.. ఇండియన్ క్రికెటర్‌తో నర్సు చాటింగ్ లీక్
దిశ,వెబ్‌డెస్క్ : ఇండియన్ క్రికెట్ టీమ్ పై మరో సారి మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఢిల్లీకి చెందిన నర్స్ భారత జట్టులోని ఓ కీలక ఆటగాడికి బెట్టింగ్ వల విసిరినట్లు తెలుస్తోంది.
ఐపీఎల్ సీజన్- 13లో ముంబై ఇండియన్స్ ఛాంపియన్ గా అవతరించిన విషయం తెలిసిందే. అయితే ఈ ఐపీఎల్ సీజన్‌లోనే టీమిండియా ఆటగాడిని సదరు నర్స్ ట్రాప్ చేసినట్లు తెలుస్తోంది. రెండేళ్లకు పైగా భారత జట్టుకు సేవలందిస్తున్న క్రికెటర్‌ను ఓ యువతి మూడేళ్ల క్రితం సోషల్ మీడియా ద్వారా పరిచయం చేసుకుంది. నేను మీకు పెద్ద ఫ్యాన్ ను, సౌత్ ఢిల్లీకి చెందిన ఓ ఫేమస్ ఆస్పత్రిలో డాక్టర్‌గా పనిచేస్తున్నాని చెప్పింది. వాస్తవానికి ఆమె అదే ఆస్పత్రిలో నర్స్‌గా విధులు నిర్వహిస్తుంది. అయితే రోజులు గడుస్తున్నాయి. క్రికెటర్-నర్స్ సోషల్ మీడియా ద్వారానే చాటింగ్ చేసుకుంటున్నారు. మధ్య, మధ్యలో హాయ్ అంటే హాయ్.. బాయ్ అంటే బాయ్ మెసేజ్‌లు పెట్టుకుంటున్నారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో.. వైరస్ సోకకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెప్పండి అంటూ క్రికెటర్.., నర్స్ ను జాగ్రత్తలు అడిగాడు. దీంతో క్రికెటర్ దారికొచ్చాడని అర్ధం చేసుకున్న నర్స్ తన ప్లాన్ ను ఎగ్జిక్యూట్ చేసింది.
గతేడాది ఐపీఎల్ సీజన్-13 మధ్యలో, సెప్టెంబర్ 30న క్రికెటర్ కు మెసేజ్ చేసింది. తాను ఐపీఎల్ సీజన్ పై బెట్‌పెట్టాలని అనుకుంటున్నట్లు, అందుకు తనకు బీసీసీఐ గురించి ఇన్ఫర్మేషన్ కావాలని సదరు క్రికెటర్‌ను అడిగింది. దీంతో క్రికెటర్ సీరియస్ ఎమోజీ సెండ్ చేశాడు. సీరియస్ ఎమోజీతో కంగుతిన్న నర్స్..ఎందుకోయ్ నేనంటే నీకంత కోపం అంటూ శాడ్ ఎమోజీలను షేర్ చేసింది. క్రికెటర్‌ను లొంగదీసుకునేందుకు ప్రయత్నించింది. చివరకు ఇది వర్కౌట్ కాదనుకొని వదిలేసింది.
అయితే సదరు టీమిండియా క్రికెటర్ – నర్స్ లు చాటింగ్ చేసుకున్న కొన్ని కీలక సాక్ష్యాధారాలు భారతీయ క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ)కు అందాయి. దీనిపై బీసీసీఐకి చెందిన అవినీతి నిరోధక విభాగం (ఏసీయూ) దర్యాప్తు చేపట్టింది. వారిద్దరి మధ్య నడిచిన ఆన్‌లైన్ చాటింగ్ డేటా వివరాలను సేకరించింది. ఆ క్రికెటర్ నుంచి వివరణ సైతం తీసుకుంది.
నర్స్‌కు,నాకు మధ్య చాటింగ్ జరిగిన మాట వాస్తవమే. మూడు సంవత్సరాల క్రితం ఆన్‌లైన్ లో అభిమానిగా పరిచయం చేసుకుంది. నేనూ చాటింగ్ చేశాను. ఐపీఎల్-13 సీజన్‌లో బెట్టింగ్ పెట్టాలని, కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ టీమ్ ఇన్ఫర్మేషన్ అడిగింది. నేను సీరియస్ గా రిప్లయ్ ఇచ్చాను. అంతే తప్ప తనకు నాకు ఎటువంటి సంబంధం లేదని క్రికెటర్ బీసీసీఐకి వివరణ ఇచ్చాడు. ఈ విషయంపై ఇండియన్ క్రికెటర్ సంతృప్తికరమైన వివరణ ఇవ్వడంతో కేసు క్లోజ్ చేసినట్లు బీసీసీఐ ఏసీయూ చీఫ్ అజిత్‌సింగ్ నేషనల్ మీడియాకు తెలిపారు.ఇకముందు ఇలాంటి పరిణామాలు తలెత్తకుండా ఉండటానికి బీసీసీఐ ఉన్నతాధికారులకు తాము కొన్ని సిఫారసులను చేసినట్లు అజిత్ సింగ్ పేర్కొన్నారు.