భూకంపం ఎఫెక్ట్.. భవనంపై ఒరిగిన మరో బిల్డింగ్.. వీడియో వైరల్

by Shamantha N |
భూకంపం ఎఫెక్ట్.. భవనంపై ఒరిగిన మరో బిల్డింగ్.. వీడియో వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్ : ఈశాన్య రాష్ట్రం అసోంలో ఈరోజు ఉదయం భారీ భూకంపం సంభవించింది. ఉదయం 7.51 గంటలకు సోనిత్‌పూర్‌లో భూమి కంపించింది. రిక్టర్‌స్కేలుపై దాని తీవ్రత 6.4గా నమోదయ్యింది. భూకంప తీవ్రత కారణంగా నగౌన్ నగరంలో ఓ ఇళ్లు మరో ఇంటిపై ఒరిగిపోయింది. దీంతో రెండు ఇళ్లలో నివాసం ఉంటున్న వారు ఒక్కసారిగా భయాందోళనకు గురై పరుగులు తీశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

తాజాగా భూకంపంపై అసోం సీఎం సర్బానంద సోనావాల్‌ స్పందించారు. అసోంలో భారీ భూకంపం కారణంగా వరుస ప్రకంపనల నేపథ్యంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అన్ని జిల్లాల నుంచి నివేదికలు తెప్పిస్తున్నట్లు చెప్పారు. ప్రాణ నష్టం జరగకుందని దేవుడిన ప్రార్థిస్తున్నట్టు తెలిపారు.

Advertisement

Next Story