- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
భర్త వీర మరణానికి నివాళిగా ఆర్మీలో చేరిన ధీర వనిత.. శభాష్ అంటోన్న అధికారులు
దిశ, వెబ్‌డెస్క్: దేశం కోసం ప్రాణాలర్పించిన అమరుల ఇంటి నుండి వారి తమ్ముడో , బంధువులో వారికి నివాళులర్పిస్తూ ఆర్మీలో చేరడం చూస్తూ ఉంటాం.. కానీ తన భర్త వీర మరణానికి నివాళిగా తాను తన మార్గంలో నడిచింది ఓ భార్య. తన భర్తకు నివాళిగా షార్ట్ సర్వీస్ కమిషన్ పరీక్షను క్లియర్ చేసి సైన్యంలో చేరి అందరి చేత ధీర వనితగా ప్రసంశలు అందుకొంటుంది. పుల్వామా అమరుడు మేజర్ విభూతి శంకర్ దౌండియాల్ సతీమణి నిఖిత కౌల్ భారత సైన్యంలో లెఫ్టినెంట్‌గా నియమితులయ్యారు. ఈ మేరకు శనివారం ఆమె ఆర్మీలో చేరారు.
సౌత్ కమాండ్ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ వైకే జోషి స్వయంగా ఆమె భుజాలపై స్టార్స్ పెట్టి సైన్యంలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ” విభూ.. నేనెప్పుడూ నీ దారిలోనే ప్రయాణించాను .. ఇప్పుడు కూడా నీ దారిలోనే ప్రయాణిస్తున్నాను.. ఈ ప్రయాణంలో నువ్వెప్పుడు నాకు తోడుగా ఉంటావని నమ్ముతున్నాను. నాపై నమ్మకం పెట్టుకొని, నన్ను నమ్మిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు” అంటూ తెలిపారు. ఈ నిర్ణయంపై నిఖిత కౌల్కు అందరు అభినందనలు తెలుపుతున్నారు.