2047 నాటికి దేశంలో పేదరికం, అసమానత కనబడకుండా చేయడమే మా లక్ష్యం: ఆర్థిక మంత్రి

by Mahesh |
2047 నాటికి దేశంలో పేదరికం, అసమానత కనబడకుండా చేయడమే మా లక్ష్యం: ఆర్థిక మంత్రి
X

దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ 2024-25 సంబంధించిన మధ్యంతర నొటాన్ బడ్జెట్ ను పార్లమెంట్ లో ప్రవేశపెట్టారు.ఈ సందర్భంగా బడ్జెట్ గురించి ఆమె ప్రసంగిస్తూ.. భాతర ప్రభుత్వ సబ్ కా సాత్.. సబ్ వికాస్ లక్ష్యంగా చేసుకుని ముందుకు సాగుతుందని మరోసారి స్పష్టం చేశారు. అలాగే కరోనా వంటి మహమ్మారి తట్టుకుని దేశం నిలబడిందని.. తమ ప్రభుత్వం ముందస్తు ఆలోచనలతో తీసుకున్న కీలక నిర్ణయాల వల్ల ఆర్థిక వృద్ధి క్రమంగా పెరుగుతుందని ఆర్థిక మంత్రి చెప్పుకొచ్చారు. అలాగే దేశంలో 2047 నాటికి పేదరికం, అసమానత కనబడకుండా చేయడమే భారత ప్రభుత్వ లక్ష్యం అని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పుకొచ్చారు.

Advertisement

Next Story