- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
నో డౌట్.. నువ్వు మగాడివే.. కానీ అతడు నిన్ను స్త్రీని అత్యాచారం చేసినట్టు చేశాడు
నాదో వింత సమస్య మేడమ్.. 30 సంవత్సరాలున్న నాకు ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. నాకూ పెళ్లి చేసుకోవాలని ఉంది. కానీ నాకు అమ్మాయి మీద సెక్స్ ఫీలింగ్స్ రావట్లేదు. నాకు 12 ఏళ్లున్నప్పుడు పదో తరగతి చదువుతున్న పిల్లాడు నాపై అసభ్యంగా ప్రవర్తించాడు. అప్పటినుంచీ నాకు నేను అమ్మాయిని అన్న అనుమానం కలగసాగింది. కానీ ఎప్పుడూ అబ్బాయిలతో సంబంధంలో లేను కానీ... అమ్మాయిలంటే ఆసక్తి కలగటం లేదు. నాకు భయంగా ఉంది. నేను గే నా... నేను అమ్మాయిని పెళ్లి చేసుకుని అందరిలాగా భార్యా పిల్లలతో ఉంటానా..? నన్ను ఈ భయాలు తినేస్తున్నాయి. నేనేం చేయాలో తెలియక సతమతమవుతున్న. సైక్రియాట్రీస్ట్ రాసిన మందులు వాడినా తగ్గట్లేదు. ఏం చేయమంటారు. -సైకత్, నిజామాబాద్
సైకత్... మొదటగా నువ్వు చేయాల్సింది ఏంటంటే.. నువ్వు గే కాదని బలంగా నమ్మడం. నీ సుదీర్ఘమైన లెటర్‌లో ఎక్కడా నీకు ఒక్క గే లక్షణం కూడా లేదు. బాల్యంలో నీ మీద మరొక పిల్లవాడు చేసిన లైంగిక అత్యాచారం వలన నువ్వు నిన్ను ఒక బలహీనమైన మనిషిగా భ్రమపడుతున్నావు. అతను బలాన్ని ఉపయోగించి ఒక స్త్రీని చేసినట్లు రేప్ చేశాడు. అందుకే నీకు అలాంటి భయంతో కూడిన అనుమానం కలుగుతోంది తప్ప నువ్వు గే కావడం వల్ల కాదు. గే కాని మగపిల్లల మీద కూడా అత్యాచారాలు జరుగుతాయి. నీపై జరిగింది ఇదే. దానికి నీవు నీ సెక్సువల్ అస్థిత్వాన్ని అనుమనించకూడదు. అశాస్త్రీయ జ్ఞానం, భయం, అనుమానం, ఆందోళన, అపనమ్మకం లాంటి వాటి వలన కూడా నీకు వచ్చే అనుమానాలు వస్తాయి. అవి నీలో స్త్రీల పట్ల సహజంగా రావాల్సిన, కలగాల్సిన ఇష్టాన్ని ఆపే అవకాశం ఉంది. నువ్వు చక్కగా అమ్మాయిని పెళ్లి చేసుకుని మంచి భర్తగా పిల్లా పాపలతో ఉండొచ్చు. అయితే ఈ భయాలు, అపనమ్మకాలు పోగొట్టుకుని మాత్రమే పెళ్ళి చేసుకోవాలి. నీవు కౌన్సిలింగ్, సైకోథెరపీ, సైకో-సెక్సువల్ థెరపీ తీసుకోవాలి. హార్మోనల్ ప్రొఫైల్ టెస్ట్స్ చేయించుకోవాలి. మంచి సెక్సాలజిస్టుని కలువు.
- డాక్టర్ భారతి, MS
మేరిటల్ కౌన్సెలర్
సైకోథెరపిస్ట్ & సెక్సాలజిస్ట్