OTT: ఐదు నెలలు తర్వాత ఓటీటీలోకి వస్తున్న డార్క్ క్రైమ్ థ్రిల్లర్..

by sudharani |
OTT: ఐదు నెలలు తర్వాత ఓటీటీలోకి వస్తున్న డార్క్ క్రైమ్ థ్రిల్లర్..
X

దిశ, సినిమా: ఈ మధ్య కాలంలో ఓటీటీ (OTT)లోకి ఎక్కువగా హారర్, క్రైమ్ థ్రిల్లర్ మూవీస్ వస్తూ ఆడియన్స్‌ను మెప్పిస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా మరో డార్క్ క్రైమ్ థ్రిల్లర్ (Dark Crime Thriller) చిత్రం ఓటీటీలో రిలీజ్ అయ్యేందుకు సిద్ధం అవుతోంది. ‘7/G బృందావన్ కాలనీ’ (7/G Brindavan Colony) సినిమాతో తమిళ (Tamil), తెలుగు (Telugu)లో ఫుల్ క్రేజ్ తెచ్చుకున్న సోనియా అగర్వాల్ (Sonia Agarwal) ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘7/G ది డార్క్ స్టోరీ’ (7/G The Dark Story). ఈ ఏడాది జులై 5న థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం ఐదు నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధం అయింది. ఈ మేరకు ‘7/G ది డార్క్ స్టోరీ’ (7/G The Dark Story) డిసెంబర్ 12 నుంచి ఆహా (aha) వీడియో‌లో స్ట్రీమింగ్ కానున్నట్లు అఫీషియల్‌గా అనౌన్స్ చేసింది సోనియా. అయితే.. ఈ చిత్రం థియేటర్లలో కేవలం మిక్సిడ్ టాక్‌కే పరిమితం కాగా.. ఓటీటీలో ఎలాంటి టాక్ సొంతం చేసుకుంటోందో తెలియాల్సిన ఉంది.

Advertisement

Next Story