AP Elections 2024: ఏపీలో కొనసాగుతున్న ఓటింగ్.. నదిలో పాట్లు

by Indraja |
AP Elections 2024: ఏపీలో కొనసాగుతున్న ఓటింగ్.. నదిలో పాట్లు
X

దిశ వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో అటు అసెంబ్లీఎన్నికలతోపాటుగా ఇటు సార్వత్రిక ఎన్నికలకు సైతం పోలింగ్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కొన్ని చోట్ల తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ప్రజలు ఇబ్బంధులను ఎదుర్కొంటున్నారు. తాజాగా నది దాటుకుని వచ్చి తమ ఓటు హక్కును ఓటర్లు వినియోగించుకున్నారు. ఈ ఘటన పార్వతీపురం మన్యం జిల్లాలో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే.. పార్వతీపురం మన్యం జిల్లాలోని కొమరాడ మండలం, రెబ్బ గ్రామస్తులు ఓటు వెయ్యాలి అంటే కూనేరు పోలింగ్‌ కేంద్రానికి వెళ్లాలి. అయితే రెబ్బగ్రామానికి కూనేరుకు మధ్య నాగావళి నది అడ్డంగా ఉంది. రెండు ఊర్లకు మధ్య రాకపోకలు నాగావళి నదిలో నుండే సాగాలి. దీనితో రెబ్బ గ్రామస్తులు నాగావళి నదిని దాటుకుని కూనేరు పోలింగ్‌ కేంద్రానికి వెళ్లి, అక్కడ రెబ్బ గ్రామస్తులు ఓటు వేశారు. కాగా వారిలో వృద్ధులు సైతం ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed