- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కాంగ్రెస్ తొలి జాబితా ఖరారు.. ఇక ప్రకటన రావడమే ఆలస్యం!
దిశ, తెలంగాణ బ్యూరో: వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో అభ్యర్థుల్ని ఖరారు కోసం కాంగ్రెస్ ఎలక్షన్ కమిటీ సుదీర్ఘ భేటీ నిర్వహణ అనంతరం 6 రాష్ట్రాల జాబితాను పాక్షికంగా ఖరారు చేసింది. ఢిల్లీలోని ఏఐసీసీ భవన్‌లో గురువారం మధ్యాహ్నం నుంచి రాత్రివరకు జరిగిన మీటింగ్‌లో కేరళ, కర్ణాటక, తెలంగాణ, చత్తీస్‌గఢ్, ఢిల్లీ, లక్షద్వీప్ రాష్ట్రాల్లోని పలు ఎంపీ సెగ్మెంట్ల అభ్యర్థుల పేర్లును ఫైనల్ చేసింది. సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సభ్యులతో పాటు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలోని పలువురు సభ్యులు, ఆయా రాష్ట్రాల పీసీసీ చీఫ్‌లు ఈ మీట్‌కు హాజరయ్యారు. తెలంగాణ నుంచి సీఎం రేవంత్(పీసీసీ చీఫ్), మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (ఎలక్షన్ కమిటీ మెంబర్), డిప్యూటీ సీఎం భట్టి, రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి దీపాదాస్ మున్షీ తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్రంలోని 17 ఎంపీ స్థానాల్లో మొత్తం 314 అప్లికేషన్లలో 5 రిజర్వుడు (3 ఎస్సీ, 2ఎస్టీ) సెగ్మెంట్లకే 169 దరఖాస్తులు వచ్చాయి. పార్టీ వ్యూహకర్త సునీల్ కనుగోలు ఏఐసీసీ పెద్దలకు గెలిచే అభ్యర్థుల జాబితాను ఇచ్చారు. మహబూబ్ నగర్ నుంచి వంశీచంద్‌రెడ్డి, చేవెళ్ళ నుంచి పట్నం సునీతా మహేందర్ రెడ్డి పోటీ చేస్తారని సీఎం ఇప్పటికే హింట్ ఇచ్చారు. ఇక నల్లగొండ నుంచి జానారెడ్డి కొడుకు రఘువీర్‌రెడ్డి, భువనగిరిలో కోమటిరెడ్డి బ్రదర్స్ ఏకాభిప్రాయంతో ఆ ఫ్యామీలీస్‌కు చెందిన వ్యక్తికి, ఖమ్మంలో మంత్రి పొంగులేటి సోదరుడు ప్రసాద్ రెడ్డికి, సికింద్రాబాద్ సీటును జీహెచ్ఎంసీ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ భార్య శ్రీదేవికి, నిజామాబాద్ సీటును ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డికి, కరీంనగర్‌లో ప్రవీణ్‌రెడ్డికి టికెట్ ఇవ్వనున్నట్లు ఊహాగానాలు వినిపించాయి.
వీరంతా రేసులో ఉన్నారు. ఖమ్మంలో భట్టి సతీమణి నందిని కూడా టికెట్‌ను ఆశిస్తున్నారు. పెద్దపల్లిలో ఎమ్మెల్యే వివేక్ తన కొడుకు వంశీని పోటీ చేయించాలని గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. నాగర్‌కర్నూల్ నుంచి మల్లు రవి పేరు ఖరారైందని వార్తలొచ్చాయి. అయితే, సెంట్రల్ ఎలక్షన్ కమిటీ మీటింగులో వీరందరిలో ఎవరి పేర్లు ఫైనల్ అయ్యాయో తెలియాల్సిఉంది. నిజానికి నేటి రాత్రికే మంత్రి ఉత్తమ్ అభ్యర్థుల లిస్టును ప్రకటిస్తారని పార్టీ నుంచి లీకులు వచ్చినా ఇంకా దానిపై క్లారిటీ రాలేదు.