ఆ 24 గంటలు అత్యంత కీలకం.. గుట్టుచప్పుడు కాకుండా పని పూర్తి చేస్తోన్న ప్రధాన పార్టీలు!

by GSrikanth |
ఆ 24 గంటలు అత్యంత కీలకం.. గుట్టుచప్పుడు కాకుండా పని పూర్తి చేస్తోన్న ప్రధాన పార్టీలు!
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఎన్నికల ప్రచారం ముగియడంతో అన్ని పార్టీలు ఓటర్లను మచ్చిక చేసుకోవడంపై ఫోకస్ పెట్టాయి. ప్రతికూలంగా ఉన్న గ్రామాలు, ఏరియాలపై ఫోకస్ పెట్టి, తమకు అనుకూలంగా ఓటింగ్ జరిగే విధంగా ప్లాన్ వేస్తున్నాయి. అందుకోసం క్షేత్ర స్థా యిలో ఉన్న లీడర్లకు ఫోన్లు, వాట్సాప్ ద్వారా ది శానిర్దేశం చేస్తున్నాయి. తటస్థ ఓటర్లు ప్రత్యర్థి పార్టీ వైపు మళ్లకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాయి.

చివరి రోజు చాలా కీలకం

ఓటింగుకు కేవలం కొన్ని గంటల సమ యం ఉండటంతో, అన్ని పార్టీలు పోల్ మేనేజ్ మెంట్‌పై దృష్టిపెట్టాయి. తమ కేడర్ ను రం గంలోకి దింపి ఓటర్లను మచ్చిక చేసుకునేందుకు సలహాలు,సూచనలు చేస్తున్నాయి. బలహీ నంగా ఉన్న గ్రామాలు, ఏరియాల్లో ప్రత్యేకంగా ఫోకస్ పెడుతున్నాయి. అందుకోసం శనివారం సాయంత్రం నుంచే స్థానిక లీడర్లతో సమన్వయం చేసుకుంటూ, ఓటర్లను ఆకర్శించే పనిలో పడ్డాయి. ప్రధానంగా నెగిటివ్ ఉన్న పోలింగ్ స్టేషన్ల పరిధిలో డబ్బుల పంపిణీకి అన్ని పార్టీలు కేడర్ ను సిద్ధం చేశారనే ప్రచారం జరుగుతోంది. ఏ గ్రామంలో ఎంత మొత్తంలో డబ్బులు పంపిణీ చేయాలి? ఏ సామాజిక వర్గానికి ఇవ్వాలి? అనేది ముందుగా ప్లాన్ వేసుకుని డబ్బులను సరఫరా చేశారనే చర్చ జరుగుతోంది. అయితే ప్రత్యర్థి పార్టీలు డబ్బులు పంపిణీ చేస్తుంటే అడ్డుకోవద్దని అన్ని పార్టీలు తమ కేడర్ ను ఆదేశించినట్టు సమాచారం.

మినిమం రూ.200.. మాగ్జిమం రూ.500

అసెంబ్లీ ఎన్నికలతో పోల్చితే పార్లమెంట్ ఎన్నికల్లో డబ్బుల పంపిణీ పెద్దగా కనిపించడం లేదు. కానీ పార్టీల మధ్య ముఖాముఖీ పోటీ ఉన్న సెగ్మెంట్లలో డబ్బుల పంపిణీ జోరుగా సాగుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. కొన్ని చోట్ల ప్రత్యర్థి పార్టీతో సమానంగా డబ్బులు ఇస్తుండగా, ఇంకొన్ని చోట్ల అదనంగా రూ.100 నుంచి రూ.200 వరకు పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలుస్తోంది. చాలా నియోజకవర్గాల్లో ఓటుకు రూ.200 పంపిణీ చేసేందుకు పార్టీలు రెడీ అయినట్టు సమాచారం. అయితే ద్విముఖ పోటీ తీవ్రంగా ఉన్న సెగ్మెంట్లలో కొన్ని పార్టీలు రూ.500 వరకు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేసుకున్నట్టు ప్రచారం ఉంది. అయితే సెగ్మెంట్లలో ఓటర్లందరికీ డబ్బులు ఇవ్వాలంటే ఖర్చు అధికం అవుతుందన్న భయంతో పార్టీలు 50 నుంచి 60 శాతం ఓటర్లకు మాత్రమే డబ్బు పంపిణీ చేసేందుకు సిద్ధమైనట్టు సమాచారం.

Advertisement

Next Story

Most Viewed