‘అలా జరుగుతుంటే నువ్వేం చేస్తున్నావ్’.. CM రేవంత్‌కు కేసీఆర్ సూటి ప్రశ్న

by GSrikanth |
‘అలా జరుగుతుంటే నువ్వేం చేస్తున్నావ్’.. CM రేవంత్‌కు కేసీఆర్ సూటి ప్రశ్న
X

దిశ, వెబ్‌డెస్క్: ఎన్నికల వేళ బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. శనివారం ఆయన తెలంగాణ భవన్‌లో మీడియా సమావేశం నిర్వహించారు. చేతగాని వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉంటే పెట్టుబడులు రివర్స్ వెళ్లిపోతాయని అన్నారు. పరిశ్రమలు గుజరాత్‌కు వెళ్లిపోతుంటే ‘మరి నువ్వేం చేస్తున్నావ్’ అంటూ రేవంత్ రెడ్డిని కేసీఆర్ ప్రశ్నించారు. తాము మోడీని తట్టుకొని ఫేస్ బుక్ లాంటి అనేక బహుళజాతి కంపెనీలను హైదరాబాదుకు తెచ్చామని గుర్తుచేశారు. ఢిల్లీ లిక్కర్ స్కాం మోడీ రాజకీయ సృష్టి అని సీరియస్ అయ్యారు. తాను, అరవింద్ కేజ్రీవాల్ మోడీ కంట్లో నలుసులా ఉన్నామని అన్నారు.

అందుకే తమ ప్రభుత్వాలను కూల్చేందుకు ఏజెంట్లను పంపారని చెప్పారు. ‘ప్రభుత్వాన్ని కూల్చడానికి ప్రయత్నించిన బీఎల్ సంతోష్ తప్పించుకున్నాడు. తనను, కేజ్రీవాల్‌ను రాజకీయంగా ఒత్తిడి చేయడానికే బీజేపీ ఈ స్కాంకు తెరలేపింది’ అని కీలక వ్యాఖ్యలు చేశారు. నిజమైన హిందువులు ఎవరూ బీజేపీకి ఓటు వేయరు అన్నారు. ముస్లింలు కూడా ఆచితూచి ఓట్లు వేయాలని సూచించారు. బీజేపీకి కాదని పొరపాటున కాంగ్రెస్‌కు ఓటు వేస్తే.. బీజేపీ గెలుస్తుంది అని షాకింగ్ కామెంట్స్ చేశారు. బీఆర్ఎస్ పార్టీ సెక్యులర్ అని.. బీఆర్ఎస్‌కు ఓటు వేస్తే భవిష్యత్తులో హక్కులు కాపాడుకోవచ్చని తెలిపారు. తెలంగాణ ప్రజలకు బీఆర్ఎస్సే శ్రీరామ రక్ష అని పేర్కొన్నారు.

Advertisement

Next Story