కార్యకర్తల సేవలు వెలకట్టలేనివి: హరీష్ రావు

by GSrikanth |
కార్యకర్తల సేవలు వెలకట్టలేనివి: హరీష్ రావు
X

దిశ, తెలంగాణ బ్యూరో: పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించడానికి నిర్విరామంగా పనిచేసిన ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలకు, శ్రేయోభిలాషులకు మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. సోమవారం ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం ఎంతో శ్రమించిన కార్యకర్తల సేవలు వెలకట్టలేనివి అని, ప్రజా క్షేత్రంలో ప్రత్యక్షంగా ప్రజలతో సంబంధం కలిగి ఉండి, అంకితభావంతో మీరు పడిన కష్టం, తపన నాతో పాటు అందరికీ స్ఫూర్తిదాయకం అన్నారు.



Next Story

Most Viewed