తొలి రెండు దశల తుది ఓటింగ్ శాతాన్ని విడుదల చేసిన ఈసీ

by Swamyn |
తొలి రెండు దశల తుది ఓటింగ్ శాతాన్ని విడుదల చేసిన ఈసీ
X

దిశ, నేషనల్ బ్యూరో: లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా ఇప్పటివరకు జరిగిన తొలి, రెండో దశ పోలింగ్‌లకు సంబంధించిన తుది ఓటింగ్ శాతాన్ని కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) మంగళవారం విడుదల చేసింది. ఏప్రిల్ 19న జరిగిన తొలి దశ ఎన్నికల్లో దేశంలోని 21 రాష్ట్రాలు, యూటీల్లోని 102 స్థానాలకు పోలింగ్ నిర్వహించగా, 66.14శాతం పోలింగ్ నమోదైనట్టు ఈసీ వెల్లడించింది. 13 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 88 స్థానాలకు 26న జరిగిన రెండో దశ ఎన్నికల్లో 66.71శాతం పోలింగ్ నమోదైనట్టు పేర్కొంది. ఈసీ వెల్లడించిన వివరాల ప్రకారం, తొలి, రెండో దశలో స్త్రీ, పురుషుల వారీగా నమోదైన ఓటింగ్ శాతాన్ని పరిశీలిస్తే..

ఫేజ్-1

పురుషులు: 66.22%

మహిళలు: 66.07%

ఇతరులు: 31.32%

మొత్తం పోలింగ్ శాతం: 66.14%

ఫేజ్-2

పురుషులు: 66.99%

మహిళలు: 66.42%

ఇతరులు: 23.86%

మొత్తం పోలింగ్ శాతం: 66.71%

* తొలి దశలో లక్షద్వీప్‌లో అత్యధికంగా 84.16శాతం పోలింగ్ నమోదవ్వగా, బిహార్‌లో అత్యల్పంగా 49.26శాతం మాత్రమే నమోదైంది.

* రెండో దశలో మణిపూర్‌లో అత్యధికంగా 84.85శాతం, ఉత్తరప్రదేశ్‌లో అత్యల్పంగా 55.19శాతం పోలింగ్ నమోదైంది.


Advertisement

Next Story

Most Viewed