బీజేపీకి సీట్లు పెరగడానికి అసలు కారణం ఇదే.. CM రేవంత్ కీలక వ్యాఖ్యలు

by Gantepaka Srikanth |
బీజేపీకి సీట్లు పెరగడానికి అసలు కారణం ఇదే.. CM రేవంత్ కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మంచి ఫలితాలు వచ్చాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు. బుధవారం జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశ వ్యాప్తంగా రాహుల్ గాంధీ నిర్వహించిన భారత్ జోడో యాత్రతోనే పరిస్థితి మారిందని అన్నారు. మోడీ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించడంలో రాహుల్ గాంధీ సక్సెస్ అయ్యారని తెలిపారు. తెలంగాణలోనూ మంచి ఫలితాలు వచ్చాయని తెలిపారు. మా వంద రోజుల పాలనను ప్రజల ముందు పెట్టి ఓట్లు అడిగినట్లు గుర్తుచేశారు. వందరోజుల పాలనకు రెఫరెండంగా ఎన్నికలకు వెళ్లినట్లు తెలిపారు. మా పాలనను చూసే తీర్పు ఇవ్వాలని ప్రజలను కోరినట్లు చెప్పారు. ఎనిమిది చోట్ల తమను, ఎనిమిది చోట్ల బీజేపీని గెలిపించారని అన్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్‌కు 41 శాతం ఓట్లు వచ్చాయి. గత ఎన్నికలతో పోలిస్తే ఓటింగ్ శాతం తమకు భారీగా పెరిగిందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల వల్లే ఇది సాధ్యమైందని వెల్లడించారు. బీజేపీకి కూడా ఓట్లు, సీట్లు పెరిగాయని అన్నారు. బీఆర్ఎస్ తనకు తాను ఆత్మబలిదానం చేసుకోవడం వల్లే బీజేపీ పుంజుకున్నదని చెప్పారు. బీజేపీ గెలిచిన మెజార్టీ సీట్లలో బీఆర్ఎస్‌కు డిపాజిట్లు కూడా రాలేదని అన్నారు. సిద్దిపేటలో కూడా బీజేపీకి మెజార్టీ వచ్చిందని.. హరీష్ రావు కావాలనే సిద్దిపేటలో బీజేపీకి ఓట్లు బదిలీ చేశారని విమర్శించారు. సిద్దిపేటలో బీజేపీకి మెజార్టీ రావడం వల్లే కాంగ్రెస్‌ ఓడిపోవాల్సిన పరిస్థితి వచ్చిందని వెల్లడించారు. ఆత్మబలిదానం వల్ల చరిత్రలో మొదటిసారి పార్లమెంట్‌లో బీఆర్ఎస్‌కు ప్రాతినిథ్యం లేకుండా పోయిందని అన్నారు. ఇకనైనా బీఆర్ఎస్ నేతలు తీరు మార్చుకోవాలని స్వీట్ వార్నింగ్ ఇచ్చారు.

Advertisement

Next Story

Most Viewed