2024 Election Results: ఏపీలో కూటమి ఘన విజయం.. సీఎంగా చంద్రబాబు సరికొత్త రికార్డు..

by Indraja |
2024 Election Results: ఏపీలో కూటమి ఘన విజయం.. సీఎంగా చంద్రబాబు సరికొత్త రికార్డు..
X

దిశ వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో 2024 ఎన్నికల ఫలితాలు ఉత్కంఠభరితంగా కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల్లో కూటమి విజయపథంలో దూసుకెళ్తోంది. 152 స్థానాల్లో కూటమి అభ్యర్థులు ఆథిక్యంతో ఉండగా.. అందులో 127 స్థానాల్లో టీడీపీ, 19 స్థానాల్లో జనసేన, 6 స్థానాల్లో బీజేపీ లీడ్‌లో ఉంది. దీనితో 2024 ఎన్నికల్లో వైసీపీ ఓడిపోవడం ఖాయం అని తేలిపోయింది.

కాగా కూటమి అధికారంలోకి వచ్చి నారా చంద్రబాబు సీఎం అయితే ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా అత్యధిక కాలం ప్రాతినిధ్యం వహించిన ఘణత చంద్రబాబు నాయుడుకే దక్కుతుంది. 2024లో చంద్రబాబు సీఎం అయితే.. 5 కాదు పది కాదు ఏకంగా పంతొమ్మిదిన్నర సంవత్సరాలు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రాతినిధ్యం వహించినట్టు అవుతోంది.

సీఎంగా చంద్రబాబు నాయుడు ప్రస్థానం..

టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మోదటిసారిగా 1994లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎన్నికైయ్యారు. ఆ తరువాత జరిగిన 1999 ఎన్నికల్లో సైతం టీడీపీ అధికారంలోకి వచ్చింది. దీనితో నారా చంద్రబాబు నాయుడు మరోసారి సీఎం అయ్యి వరుసగా రెండసార్లు ముఖ్యమంత్రిగా ప్రాతినిధ్యం వహించారు. ఇలా 1999 నుండి 2004 వరకు చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నారు.

అయితే అనివార్య కారణాల చేత 2004లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయి, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అలానే 2009 జరిగిన ఎన్నికల్లో సైతం కాంగ్రేస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. దీనితో దశాబ్ధకాలంపాటు ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు నాయుడు 2014 ఎన్నికల్లో తిరిగి అధికారంలోకి వచ్చారు. కాగా 2019 ఎన్నికల్లో 151 స్థానాలను కైవసం చేసుకుని వైసీపీ అధికారంలోకి వచ్చింది.

ఇక 2024 ఎన్నికల ఫలితాలు ప్రస్తుతం కొనసాగుతున్నాయి. ఈ ఎన్నికల్లో కూటమి అధికారంలోకి వచ్చి చంద్రబాబు నాయుడు సీఎం అయితే ఏపీ సీంఎంగా నాలుగుసార్లు ప్రాతినిధ్యం వహించిన వ్యక్తిగానే కాదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు రెండుసార్లు, నవ్యాంధ్రకు రెండుసార్లు సీఎంగా ప్రాతినిధ్యం వహించి పంతొమ్మిదిన్నర సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రిగా పని చేసిన నేతగా చంద్రబాబు చరిత్ర సృష్టిస్తారు.

Advertisement

Next Story

Most Viewed