- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అప్పటి వరకు ఆర్సీబీ టైటిల్ గెలవదు : హర్భజన్ సింగ్
దిశ, స్పోర్ట్స్ : నాణ్యమైన బౌలర్లను తీసుకునేంత వరకూ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు టైటిల్ గెలవదని భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ వ్యాఖ్యానించాడు. తాజాగా స్టార్ స్పోర్ట్స్‌తో హర్భజన్ సింగ్ మాట్లాడుతూ.. ఆర్సీబీపై కీలక వ్యాఖ్యలు చేశాడు. వచ్చే వేలంలోనైనా నాణ్యమైన బౌలర్లను తీసుకోవాలని సూచించాడు. ‘వేలంలో కూర్చునే వాళ్లు సమతుల్యమైన జట్టును తీసుకోవాలి. భారీ బ్యాటింగ్ దళంతో ఎల్లప్పుడూ మ్యాచ్‌లను గెలవలేం. మంచి బౌలర్లను ఎన్నుకునేంత వరకూ మీరు టైటిల్స్ గెలవలేరు.’ అని చెప్పాడు.
అలాగే, ఆర్సీబీ సపోర్టింగ్ సిబ్బందిలో భారతీయుడి అవసరం ఉందని చెప్పాడు. ‘భారత యువకులను అర్థం చేసుకునే భారతీయుడు ఆర్సీబీ మేనేజ్‌మెంట్‌లో ఉండాలి. అతను దేశవాళీ క్రికెట్‌లో భారత ఆటగాళ్ల ప్రదర్శనను చూసి, వాళ్ల ఎంపికను నిర్ధారించాలి. మంచి బౌలింగ్ దళం కోసం ఇది కీలకం. ఆర్సీబీ ఎల్లప్పుడూ బలమైన బ్యాటింగ్ లైనప్‌ను కలిగి ఉంది. కానీ, బౌలింగ్ పరంగా నిరాశపరుస్తున్నది.’ అని చెప్పుకొచ్చాడు. భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ కూడా ఆర్సీబీ సపోర్టింగ్ స్టాఫ్‌లో భారతీయుడు లేకపోవడమే ఆ జట్టు సమస్యకు కారణమని చెప్పిన విషయం తెలిసిందే. కాగా, 2 విజయాలతో పాయింట్స్ టేబుల్‌లో అట్టడుగు స్థానంలో ఉన్న బెంగళూరు ప్లే ఆఫ్స్‌కు చేరుకోవాలంటే అద్భుతమే జరగాలి. హైదరాబాద్‌పై విజయంతో గెలుపు రుచిచూసిన ఆ జట్టు మిగతా ఐదు మ్యాచ్‌ల్లో నెగ్గినా ముందడగు వేయడం కష్టమే.