- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఆర్సీబీతో మ్యాచ్‌లో కొత్త జెర్సీలో రాజస్థాన్.. కారణం ఏంటంటే?
దిశ, స్పోర్ట్స్ : ఐపీఎల్-17లో రాజస్థాన్ రాయల్స్ హ్యాట్రిక్ విజయాలతో జోరు మీద ఉన్నది. ఆ జట్టు తదుపరి మ్యాచ్‌లో శుక్రవారం జైపూర్ వేదికగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ)తో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ జట్టు కొత్త జెర్సీతో ఆడనుంది. పూర్తిగా పింక్ కలర్‌తో ఉన్న జెర్సీని ఆ జట్టు ఆటగాళ్లు ధరించనున్నారు.దీనికి కారణం లేకపోలేదు.
On April 6, every six will count. It’s our #PinkPromise! 💗💪
— Rajasthan Royals (@rajasthanroyals) April 5, 2024
With the support of trained women solar engineers from Rajasthan, every six hit tomorrow will help us power six homes! ☀️ pic.twitter.com/Vo7feGsbP3
రాయల్ రాజస్థాన్ ఫౌండేషన్(ఆర్‌ఆర్ఎఫ్) రాజస్థాన్ మహిళల సాధికారత కోసం కృషి చేస్తున్నది. అందులో భాగంగా రాజస్థాన్-బెంగళూరు మ్యాచ్‌ను రాజస్థాన్ మహిళలకు అంకితం చేశారు. ‘పింక్ ప్రామిస్’ కాన్సెప్ట్‌తో పూర్తిగా పింక్ కలర్ జెర్సీని రాజస్థాన్ ఆటగాళ్లు ధరించనున్నారు. ఆ జెర్సీపై కొంతమంది ఆర్‌ఆర్ఎఫ్ మహిళా లబ్దిదారులపై పేర్లు కూడా ఉన్నాయి. అంతేకాకుండా, ఈ మ్యాచ్ కోసం విక్రయించే ప్రతి టికెట్‌పై రూ. 100 రూపాయలను, పింక్ జెర్సీ అమ్మకాల ద్వారా వచ్చే మొత్తాన్ని రాజస్థాన్ రాయల్స్ మహిళల సంక్షేమం కోసం చెల్లిస్తుంది. అలాగే, ఈ మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లో సిక్స్ నమోదైన ప్రతిసారి రాజస్థాన్‌లోని ప్రతి ఆరు ఇళ్లకు సోలార్ పవర్ అందించనున్నట్టు ఫ్రాంచైజీ యాజమాన్యం తెలిపింది.