ఉప్పల్ గడ్డపై ముంబై హ్యాట్రిక్ విక్టరీ

by Mahesh |
ఉప్పల్ గడ్డపై ముంబై హ్యాట్రిక్ విక్టరీ
X

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ 2023లో బాగంగా హైదరాబాద్, ముంబై మధ్య జరిగిన 25వ మ్యాచ్‌లో MI విజయం సాధించింది. ఈ మ్యాచ్‌ మొదట్లో టాస్ ఓడిన ముంబై జట్టు బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 192 పరుగులు చేసింది. అనంతరం 193 పరుగుల లక్ష్యంతో చేజింగ్ కు దిగిన SRH జట్టుకు మొదట్లోనే బ్రూక్, త్రిపాఠి, వెంట వెంటనే అవుట్ అవ్వడంతో కష్టాల్లో పడింది. అనంతరం వచ్చిన మార్క్రమ్ మ్యాచ్ ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు.

అలాగే హెన్రిచ్ క్లాసెన్ కాసేపు మెరుపులు మెరిపించాడు. కానీ ఇద్దరు వెంట వెంటనే అవుట్ కావడం, తర్వాత వచ్చిన వారు సరిగా రానించకపోవడం.. మొదటి నుంచి బ్యాటింగ్ చేసిన మయాంక్ కూడా అవుట్ కావడంతో హైదరాబాద్ జట్టు 19.5 ఓవర్లకు ఆల్ అవుట్ అయింది. దీంతో ముంబై జట్టు 14 పరుగుల తేడాతో గెలిచి.. ఈ సిజన్‌లో వరుసగా మూడు విజయాలు నమోదు చేసుకుని హాట్రిక్ కొట్టింది.

Advertisement

Next Story