- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రాహుల్, సంజీవ్ గోయెంకా వీడియోపై అసిస్టెంట్ కోచ్ ఏమన్నాడంటే?
దిశ, స్పోర్ట్స్ : ఈ నెల 8న హైదరాబాద్ చేతిలో లక్నో ఓడిపోయిన విషయం తెలిసిందే. ఆ మ్యాచ్ అనంతరం కెప్టెన్ రాహుల్‌ను ఆ జట్టు ఓనర్ సంజీవ్ గోయెంకా నిలదీస్తున్నట్టు ఉన్న ఓ వీడియో వైరల్‌గా మారింది. దీంతో సంజీవ్ గోయెంకాపై విమర్శలు వచ్చాయి. భారత స్టార్ పేసర్ షమీ, మాజీ క్రికెటర్ సెహ్వాగ్ కూడా లక్నో ఓనర్ తీరును తప్పుబట్టారు. వచ్చే సీజన్‌లో రాహుల్ లక్నోను వీడతాడని కూడా ప్రచారం జరిగింది. తాజాగా దానిపై లక్నో అసిస్టెంట్ కోచ్ లాన్స్ క్లూసెనర్ స్పందించాడు. రాహుల్, సంజీవ్ గోయెంకా మధ్య వివాదాన్ని తోసిపుచ్చాడు.
సోమవారం నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో క్లూసెనర్ మాట్లాడుతూ.. ‘అది ఇద్దరు క్రికెట్ ప్రేమికుల మధ్య బలమైన చర్చ. అందులో నాకు ఎలాంటి సమస్య కనిపించలేదు. మా వరకు అది టీ కప్పులో తుపానులాంటింది. మాకు పెద్ద విషయం కాదు.’ అని చెప్పుకొచ్చాడు. కాగా, హైదరాబాద్ చేతిలో ఓడటంతో లక్నో ప్లే ఆఫ్స్ ఆశలు సంక్లిష్టమయ్యాయి. చివరి రెండు మ్యాచ్‌ల్లో నెగ్గినా.. మిగతా జట్ల ఫలితాలపైనే జట్టు అవకాశాలు ఆధారపడి ఉన్నాయి. నేడు ఢిల్లీతో లక్నో తలపడనుంది.