- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
రాహుల్, గైక్వాడ్‌కు షాక్ ఇచ్చిన ఐపీఎల్ నిర్వాహకులు.. అసలేం జరిగిందంటే?
దిశ, స్పోర్ట్స్ : లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్, చెన్నయ్ సూపర్ కింగ్స్ సారథి రుతురాజ్ గైక్వాడ్‌లకు జరిమానా పడింది. శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో చెన్నయ్‌పై 8 వికెట్ల తేడాతో లక్నో విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు తమ బౌలింగ్ కోటాను నిర్ణీత సమయంలోగా పూర్తి చేయడంలో విఫలమయ్యాయి.
దీంతో ఐపీఎల్ ప్రవర్తనా నియామవళి ప్రకారం స్లో ఓవర్ రేట్ నిబంధనను ఉల్లంఘించిన కారణంగా ఇరు జట్ల కెప్టెన్లకు జరిమానా విధించినట్టు ఐపీఎల్ నిర్వాహకులు శనివారం వెల్లడించారు. ఈ సీజన్‌లో ఇరు జట్లు ఈ నిబంధనను ఉల్లంఘించడం ఇది తొలిసారి. తొలి తప్పిదం కింద రాహుల్, గైక్వాడ్‌లకు చెరో రూ. 12 లక్షలు ఫైన్ పడింది. మళ్లీ ఇలాంటి తప్పిదానికి పాల్పడితే కెప్టెన్ల జరిమానా రెట్టింపు అవడంతోపాటు తుది జట్టులోని ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులోనూ కోత పడనుంది. ఇరు జట్లు తమ తదుపరి మ్యాచ్‌ల్లో ఈ నెల 23న మరోసారి ఎదురుపడనున్నాయి.