IPL 2024 : ముంబైకి షాకిచ్చిన గుజరాత్.. మోస్తరు లక్ష్యాన్ని కాపాడుకున్న బౌలర్లు

by Harish |
IPL 2024 : ముంబైకి షాకిచ్చిన గుజరాత్.. మోస్తరు లక్ష్యాన్ని కాపాడుకున్న బౌలర్లు
X

దిశ, స్పోర్ట్స్ : ఐపీఎల్-17‌లో గుజరాత్ టైటాన్స్ శుభారంభం చేసింది. తొలి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌కు షాకిస్తూ బోణీ కొట్టింది. మరోవైపు, తొలి మ్యాచ్‌‌ను ఓటమితో ప్రారంభించే సంప్రదాయాన్ని ముంబై జట్టు ఈ సీజన్‌లోనూ కొనసాగించింది. అహ్మదాబాద్ వేదికగా ఆదివారం రాత్రి ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో ముంబైపై 6 వికెట్ల తేడాతో గుజరాత్ విజయం సాధించింది.

టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ జట్టు నిర్ణీత ఓవర్లలో 168/6 స్కోరు చేసింది. సాయి సుదర్శన్(45) కీలక ఇన్నింగ్స్ ఆడగా.. గిల్(31), రాహుల్ తెవాటియా(22) విలువైన పరుగులు జోడించారు. ముంబై బౌలర్లలో బుమ్రా(3/14) సత్తాచాటాడు. అనంతరం 169 పరుగుల మోస్తరు లక్ష్యాన్ని గుజరాత్ బౌలర్లు కాపాడుకున్నారు. దీంతో ఛేదనకు దిగిన ముంబై నిర్ణీత ఓవర్లలో 162/9 స్కోరుకే పరిమితమైంది. బ్రెవిస్(46), రోహిత్ శర్మ(43) కీలక ఇన్నింగ్స్ ఆడి జట్టును పోటీలోకి తీసుకొచ్చినా.. ఆ తర్వాత గుజరాత్ బౌలర్లకు ధాటికి మిగతా వారు విఫలమ్యారు. చివరి ఓవర్‌లో ముంబై 19 పరుగులు చేయాల్సిన సమయంలో ఉమేశ్ యాదవ్ అద్భుతమైన బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు. పాండ్యా(11), చావ్లా(0) వికెట్లు తీయడంతోపాటు 12 పరుగులు మాత్రమే ఇచ్చి గుజరాత్‌ను విజయతీరాలకు చేర్చాడు.

Advertisement

Next Story