- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
IPL 2023: పంజాబ్ కింగ్స్‌కు భారీ ఎదురుదెబ్బ.. స్టార్ బ్యాటర్‌కు గాయం
గువహతి: ఐపీఎల్-16లో పంజాబ్ కింగ్స్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలిలా ఉన్నది. బుధవారం రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆ జట్టు స్టార్ బ్యాటర్ భానుక రాజపక్స చేతికి తీవ్ర గాయమైంది. ఓపెనర్ ప్రభ్‌సిమ్రాన్ సింగ్ అవుటైన తర్వాత క్రీజులోకి వచ్చిన రాజపక్స తాను ఎదుర్కొన్న తొలి బంతికి ఒక పరుగు తీశాడు. 11వ ఓవర్ వేసిన అశ్విన్ బౌలింగ్‌లో శిఖర్ ధావన్ తొలి బంతిని స్ట్రెయిట్ షాట్ ఆడగా బంతి నేరుగా వెళ్లి నాన్ స్ట్రైకర్ రాజపక్స మోచేతికి బలంగా తాకింది. దాంతో అతను నొప్పితో విలవిల్లాడిపోయాడు.
ఫిజియో వచ్చి పరిశీలించగా.. రాజపక్స చేయి వాచిపోయింది. దాంతో బ్యాటు కూడా పట్టుకోవడం కష్టమవడంతో రాజపక్స రిటైర్డ్‌హర్ట్‌గా వెనుదిరిగాడు. అనంతరం రాజపక్సను స్కానింగ్ కోసం తీసుకెళ్లాడు. బంతి చేతికి బలంగా తాకడంతో గాయం తీవ్రత ఎక్కువగానే ఉండే అవకాశం ఉంది. అదే జరిగితే రాజపక్స సీజన్ మొత్తానికి దూరయ్యే అవకాశాలు ఉన్నాయి. కోల్‌కతాతో జరిగిన తొలి మ్యాచ్‌లో రాజపక్స హాఫ్ సెంచరీతో కీలక ఇన్నింగ్స్ ఆడిన విషయం తెలిసిందే. ఇప్పటికే బెయిర్ స్టో దూరం కాగా.. లివింగ్‌స్టోన్ పాల్గొనడంపై కూడా అనుమానాలు నెలకొన్నాయి. రాజపక్స కూడా దూరమైతే పంజాబ్ జట్టుకు కోలుకోలేని దెబ్బ అని చెప్పొచ్చు.