- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఢిల్లీ క్యాపిటల్స్‌కు భారీ షాక్.. అతను తిరిగి రావడం డౌటే!
దిశ, స్పోర్ట్స్ : ఐపీఎల్-17కు ఢిల్లీ క్యాపిటల్స్ ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్ దూరం కానున్నట్టు తెలుస్తోంది. తొడకండరాల గాయం నుంచి కోలుకునేందుకు అతను ఇటీవల ఆస్ట్రేలియాకు తిరిగి వెళ్లిపోయిన విషయం తెలిసిందే. అయితే, అతను మిగతా మ్యాచ్‌లకు అందుబాటులోకి వచ్చే అవకాశాలు లేవని ఢిల్లీ హెడ్ కోచ్ రికీ పాంటింగ్ తెలిపాడు.
‘అతను తిరిగి వస్తాడని అనుకోవడం లేదు. క్రికెట్ ఆస్ట్రేలియా అతన్ని ఇంట్లో ఉంచి పునరావసం కల్పిస్తున్నది. అతనితో మాట్లాడాను. అతను కోలుకునేందుకు అనుకున్న సమయం కంటే ఎక్కువ పట్టొచ్చు. టీ20 వరల్డ్ కప్ సమస్యగా ఉంటుందని అనుకోను.’ అని చెప్పాడు. ఈ సీజన్‌లో నాలుగు మ్యాచ్‌లు ఆడిన మార్ష్ ఆకట్టుకోలేకపోయాడు. 61 పరుగులు, ఒక్క వికెట్ తీశాడు. జూన్ 2 నుంచి టీ20 వరల్డ్ కప్ ప్రారంభంకానుంది.
ఆస్ట్రేలియా టీ20 జట్టుకు మిచెల్ మార్ష్ కెప్టెన్‌గా ఉన్నాడు. త్వరలోనే ప్రపంచకప్ మొదలుకానున్న నేపథ్యంలో అతని విషయంలో రిస్క్ తీసుకోవద్దని క్రికెట్ ఆస్ట్రేలియా భావిస్తున్నది. మరోవైపు, ఈ సీజన్‌లో తడబడుతున్న ఢిల్లీ జట్టుకు మిచెల్ మార్ష్ దూరమవడం ఆ జట్టుకు భారీ ఎదురుదెబ్బే అని చెప్పొచ్చు.