IPL 2023: డేవిడ్ వార్నర్ అరుదైన ఘనత.. రోహిత్ రికార్డు బద్దలు

by Vinod kumar |
IPL 2023: డేవిడ్ వార్నర్ అరుదైన ఘనత.. రోహిత్ రికార్డు బద్దలు
X

దిశ, వెబ్‌డెస్క్: IPL 2023లో భాగంగా కోల్‌కతా నైట్‌ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ తొలి విజయాన్ని అందుకుంది. ఈ మ్యాచ్‌లో 4 వికెట్ల తేడాతో ఢిల్లీ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ వార్నర్‌ 41 బంతులు 11 ఫోర్లతో 57 పరుగులు చేయగా.. ఓ అరుదైన ఘనతను సాధించాడు. ఐపీఎల్‌లో కేకేఆర్ టీమ్‌పై అత్యధిక రన్స్ చేసిన ప్లేయర్‌గా డేవిడ్ వార్నర్ రికార్డులకెక్కాడు. కేకేఆర్‌పై 26 మ్యాచ్‌లో 146 స్ట్రైక్ రేట్‌తో 1,042 పరుగులు చేశాడు. అయితే అంతకుముందు ఈ రికార్డు ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ (1040) ఉంది. దీంతో రోహిత్ రికార్డును వార్నర్ బ్రేక్ చేశాడు.

ఐపీఎల్‌లో ప్రత్యర్థిపై అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్స్..

1075 - డేవిడ్ వార్నర్ vs KKR

1040 - రోహిత్ శర్మ vs KKR

1029 - శిఖర్ ధావన్ vs CSK

1005 - డేవిడ్ వార్నర్ vs PBKS

985 - విరాట్ కోహ్లీ vs CSK

Advertisement

Next Story

Most Viewed