- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చెన్నయ్‌కు లక్నో షాక్
దిశ, స్పోర్ట్స్ : లక్నో సూపర్ జెయింట్స్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టింది. హ్యాట్రిక్ విజయంపై కన్నేసిన డిఫెండింగ్ చాంపియన్ చెన్నయ్ సూపర్ కింగ్స్‌కు గట్టి షాకిచ్చింది. లక్నో వేదికగా శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో చెన్నయ్‌పై 8 వికెట్ల విజయాన్ని అందుకుంది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన చెన్నయ్ నిర్ణీత ఓవర్లలో 176/6 స్కోరు చేసింది. రవీంద్ర జడేజా(57 నాటౌట్) హాఫ్ సెంచరీతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. రహానే(36), మొయిన్ అలీ(30), ధోనీ(28 నాటౌట్) విలువైన పరుగులు జోడించడంతో ఆ జట్టు పోరాడే స్కోరు సాధించింది. అయితే, మోస్తరు లక్ష్యాన్ని లక్నో మరో ఓవర్ మిగిలి ఉండగానే ఛేదించింది. 19 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 180 పరుగులు చేసి గెలుపొందింది. ఓపెనర్లు కేఎల్ రాహుల్(82), డికాక్(54) హఫ్ సెంచరీలతో రెచ్చిపోయి గెలుపును సునాయాసం చేయగా.. పూరన్(23 నాటౌట్) మిగతా పని పూర్తి చేశాడు. ఈ విజయంతో పాయింట్స్ టేబుల్‌లో లక్నో 4వ స్థానానికి ఎగబాకింది. చెన్నయ్ మూడో స్థానంలో కొనసాగుతోంది.