Shikhar Dhawan: నువ్వు ఎప్పటికీ నాతోనే ఉంటావ్.. క్రికెటర్ శిఖర్ ధావన్ ఎమోషనల్..

by Indraja |
Shikhar Dhawan: నువ్వు ఎప్పటికీ నాతోనే ఉంటావ్.. క్రికెటర్ శిఖర్ ధావన్ ఎమోషనల్..
X

దిశ వెబ్ డెస్క్: అనివార్య కారణాలతో భారత్ ఓపెనర్ శిఖర్ ధావన్ తన భార్య ఏషా ముఖర్జీ విడాకులు తీసుకుని వీడిపోయిన విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో ధావన్ కొడుకు మైనర్ కావడంతో బాబు తల్లి దగ్గరే ఉండాలని న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. అయితే శిఖర్ ధావన్ భార్య ఏషా ముఖర్జీ ఆస్ట్రేలియన్ కావడంతో తాను తన కొడుకుతో పాటుగా ఆస్ట్రేలియా వెళ్లిపోయింది.

అయితే ధర్మాసనం ధవన్‌కి తన కొడుకును చూసుకునేందుకు అనుమతిని ఇచ్చినా.. ఏషా ముఖర్జీ మాత్రం కనీసం వీడియో కాల్‌లో అయినా ధవన్ తన కొడుకును చూసుకునేందుకు ఒప్పుకోవడం లేదు. దీనితో ధవన్ తీవ్ర మానసిక క్షోభకు అనుభవిస్తున్నారు. తన కొడుకునే తలచుకుంటూ దీనంగా ఉంటున్నారు. తాజాగా తన కొడుకు జోరావర్‌ను గుర్తు చేసుకుంటూ ఇంస్టాగ్రామ్‌లో ఎమోషనల్ పోస్ట్ చేశారు.

నువ్వు ఎప్పటికి నాతోనే ఉంటావ్ మై బాయ్.. అంటూ పంజాబ్ జెర్సీపై తన కొడుకు జోరావర్ పేరును అలానే ‘1’ నంబర్‌ వేయించాడు. అలానే దాన్ని ధరించిన ఫొటో కూడా షేర్ చేశారు. కాగా తన కొడుకుని చూసి ఏడాది అవుతుందని గతంలో పోస్ట్ చేసిన సంగంతి తెలిసిందే.

Advertisement

Next Story