- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
టీ20 వరల్డ్ కప్ అంబాసిడర్‌గా యువరాజ్ సింగ్
దిశ, స్పోర్ట్స్ : త్వరలోనే ప్రారంభమయ్యే టీ20 వరల్డ్ కప్‌కు వెస్టిండీస్, అమెరికా సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న విషయం తెలిసిందే. జూన్ 1 నుంచి టోర్నీ మొదలుకానుంది. భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ అరుదైన గౌరవం దక్కింది. ఈ పొట్టి ప్రపంచకప్‌కు అంబాసిడర్‌గా ఎంపికయ్యాడు. విండీస్ దిగ్గజ క్రికెటర్ క్రిస్ గేల్, 8సార్లు ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్ ఉసేన్ బౌల్ట్ కూడా అంబాసిడర్లుగా వ్యవహరించనున్నారు.
అంబాసిడర్‌గా యువరాజ్ ప్రపంచకప్ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటాడు. ‘ఒకే ఓవర్‌లో ఆరు సిక్స్‌లు కొట్టడంతోసహా టీ20 వరల్డ్ కప్‌తో నాకు కొన్ని మంచి జ్ఞాపకాలు. ఈ ఎడిషన్‌లో నేను భాగం కావడం ఉత్సాహంగా ఉంది. క్రికెట్ ఆడటానికి వెస్టిండీస్ గొప్ప ప్రాంతం. అమెరికాలోనూ క్రికెట్ విస్తరిస్తోంది. భారత్, పాకిస్తాన్ మ్యాచ్ ఈ ఏడాదిలోనే అతి పెద్ద క్రీడా పోటీగా నిలువనుంది. కొత్త స్టేడియంలో ఉత్తమ ఆటగాళ్లు ఆడటాన్ని చూడటం మరో విశేషం.’ అని యువరాజ్ సింగ్ తెలిపాడు.