T20 World Cup: నికోలస్ పూరన్ మెరుపులు.. లీగ్ చివరి మ్యాచ్ వెస్టిండీస్‌ భారీ విజయం

by Ramesh N |
T20 World Cup: నికోలస్ పూరన్ మెరుపులు.. లీగ్ చివరి మ్యాచ్ వెస్టిండీస్‌ భారీ విజయం
X

దిశ, డైనమిక్ బ్యూరో: టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్ గ్రూప్ సీ మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్‌పై వెస్టిండీస్ విజయం సాధించింది. రెండు జ‌ట్లూ ఇప్ప‌టికే సూప‌ర్‌-8 స్టేజ్‌కు వెళ్లినా.. చివ‌రి లీగ్ మ్యాచ్‌లో మాత్రం వెస్టిండీస్ త‌న స‌త్తా చాటింది. నికోల‌స్ పూర‌న్ సిక్స‌ర్లు, ఫోర్ల‌తో చెల‌రేగిపోయాడు. 53 బంతుల్లో ఆ హిట్ట‌ర్ 98 ర‌న్స్ చేశాడు. పూర‌న్ త‌న ఇన్నింగ్స్‌లో 8 సిక్స‌ర్లు, 6 ఫోర్లు కొట్టి ఆఫ్ఘనిస్థాన్‌కు చుక్కలు చూపించారు.

దీంతో వెస్టిండీస్ 104 ప‌రుగుల భారీ తేడాతో ఆఫ్ఘ‌న్‌పై విజ‌యం సాధించింది. ఫ‌స్ట్ బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 5 వికెట్ల న‌ష్టానికి 218 ర‌న్స్ చేసింది. ఇక బ్యాటింగ్‌లో ఆఫ్ఘ‌నిస్తాన్ తడబడింది. స్కోర్‌ను చేధించ‌లేక‌ 16.2 ఓవ‌ర్ల‌లో 114 ర‌న్స్‌కే ఆలౌటైంది. ఈ గెలుపుతో గ్రూప్ సీలో విండీస్ టాప్ ప్లేస్‌లో నిలిచింది.

Advertisement

Next Story

Most Viewed