టీ20 వరల్డ్ కప్ వెస్టిండీస్‌కు భారీ షాక్

by Harish |
టీ20 వరల్డ్ కప్ వెస్టిండీస్‌కు భారీ షాక్
X

దిశ, స్పోర్ట్స్ : టీ20 వరల్డ్ కప్‌లో విండీస్‌కు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు ఓపెనర్ బ్రాండన్ కింగ్ గాయం కారణంగా టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. ఈ నెల 20న ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో బ్రాండన్ కింగ్ గాయపడ్డాడు. విండీస్ ఇన్నింగ్స్‌లో కరన్ బౌలింగ్‌లో బంతి బ్రాండన్ కింగ్ పక్కటెముకలకు బలంగా తాకింది. దీంతో రిటైర్డ్ హర్ట్‌గా మైదానం వీడిన అతను.. తిరిగి గ్రౌండ్‌లోకి రాలేదు. హెట్మేయర్ సబ్‌స్టిట్యూట్ ఫీల్డర్‌గా వచ్చాడు. గాయం తీవ్రత ఎక్కువగా ఉండటంతోనే బ్రాండన్ కింగ్ టోర్నీ నుంచి తప్పుకున్నట్టు తెలుస్తోంది. అతని స్థానంలో బ్యాటర్ కైల్ మేయర్స్‌ విండీస్ జట్టులోకి వచ్చాడు. ఈ విషయాన్ని ఐసీసీ వెల్లడించింది. రిప్లేస్‌మెంట్‌కు ఈవెంట్ టెక్నికల్ కమిటీ ఆమోదం తెలిపిందని పేర్కొంది. కాగా, ప్రపంచకప్‌లో కింగ్ ఐదు ఇన్నింగ్స్‌ల్లో కేవలం 86 పరుగులు మాత్రమే చేశాడు.

Advertisement

Next Story