చేజింగ్‌లో వాళ్లద్దరి కాంబినేషన్ సూపర్ : ఎస్.శ్రీశాంత్

by Harish |
చేజింగ్‌లో వాళ్లద్దరి కాంబినేషన్ సూపర్ : ఎస్.శ్రీశాంత్
X

దిశ, స్పోర్ట్స్ : ఐపీఎల్-17లో ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా, ప్లేయర్‌గా విఫలమవుతున్న హార్దిక్ పాండ్యాను టీ20 వరల్డ్ కప్‌కు ఎంపిక చేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అయితే, పాండ్యాకు భారత మాజీ బౌలర్ ఎస్.శ్రీశాంత్ మద్దతుగా నిలిచాడు.గతంలో జాతీయ జట్టు తరపున పాండ్యా రాణించిన విషయాన్ని నొక్కిచెప్పాడు.‘మైదానంలో అతను ఏం చేయగలడో మనం చూశాం. అతని బ్యాటింగ్, బౌలింగ్ విధానాలు గురించి తెలుసు. కెప్టెన్‌గా కూడా టీమ్ ఇండియాను గెలిపించాడు. పాండ్యా కొత్త బంతితో, పాత బంతితో బౌలింగ్ చేయగలడు. కాబట్టి, హార్దిక్ పాండ్యాను ఎంపిక చేయడం మంచి విషయమే. ముఖ్యంగా చేజింగ్‌లో విరాట్ కోహ్లీ, పాండ్యా కాంబినేషన్ అద్భుతంగా ఉంటుంది.’ అని చెప్పాడు. ఆస్ట్రేలియా మాజీ ఆల్‌రౌండర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మాజీ కోచ్ టామ్ మూడీ కూడా పాండ్యాకు మద్దతు పలికాడు. లోయర్ ఆర్డర్‌లో పాండ్యా చేయగల పనిని ఇతరులు చేయలేరని, అలా చేసే ముగ్గురి ఆటగాళ్ల పేర్లు తనకు చెప్పాలన్నాడు.

Advertisement

Next Story