T20 ప్రపంచ కప్ 2024 ఫైనల్ విజయం.. సిరాజ్ ట్విట్‌పై నెటిజన్ల ఫైర్

by Mahesh |
T20 ప్రపంచ కప్ 2024 ఫైనల్ విజయం.. సిరాజ్ ట్విట్‌పై నెటిజన్ల ఫైర్
X

దిశ, వెబ్ డెస్క్: జూన్ 29 శనివారం రాత్రి జరిగిన టీ20 ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ లో గెలిచిన భారత్ చాంపియన్ గా నిలిచింది. ఈ మ్యాచ్ అనంతరం మహ్మద్ సిరాజ్ ట్విట్టర్ లో పెట్టిన పోస్ట్ పై తీవ్ర వ్యతిరేకతను మూటగట్టుకున్నాడు. టీ20 ప్రపంచ కప్ ట్రోఫీని ఆనందంగా ఎత్తుకున్న జట్టు చిత్రాన్ని సిరాజ్ పోస్ట్ చేస్తూ.. (Thank you almighty Allah ) ", సర్వశక్తిమంతుడైన అల్లాహ్ ధన్యవాదాలు." అని రాసుకొచ్చాడు. దీంతో అతన్ని నెటిజన్లు తీవ్ర స్థాయిలో ట్రోల్ చేయడం ప్రారంభించారు. అందులో ఒక ట్విట్టర్ యూజర్, "ఇది అల్లా విజయం కాదు.. టీమ్ ఇండియా విజయం" అని రాశారు. మరో వ్యక్తి ఇలా రాశాడు, "అల్లా అలా చేయాల్సి ఉంటే, పాకిస్తాన్ ప్రపంచకప్ గెలిచేది, భారతదేశం కాదు." అని రాసుకొచ్చారు. అలాగే మరికొందరైతే.. జట్టులో కనీసం ప్లేయింగ్ 11లో కూడా చోటు దక్కిన సిరజ్.. వరల్డ్ కప్ మొత్తాన్ని తాజే జట్టుకు సాధించిపెట్టినట్లు ఫోజ్ కొడుతున్నాడని అతని వీడియోను ట్యాగ్ చేస్తూ ట్రోల్స్ చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed